Air Hostess Video: ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్.. ఎయిర్ హోస్టెస్ వీడియో వైరల్!
విమాన ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ (Air Hostess)ను సర్వీస్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
- By Balu J Published Date - 01:27 PM, Thu - 22 December 22
విమాన (Flight) ప్రయాణాల్లో అప్పుడప్పుడు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. తోటి ప్రయాణికులు గొడవ పడటం, ఫుడ్, ఇతర విషయాల్లోనూ చిన్న చిన్న కంప్లైట్ ఇవ్వడం లాంటి జరుగుతుంటాయి. తాజాగా డిసెంబరు 16న ఢిల్లీ (Delhi) నుంచి ఇస్తాంబుల్కి వెళ్లే ఇండిగో (Indigo) విమానంలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని ఉద్దేశించి ‘‘నేను నీ సర్వెంట్ ను కాను’ అని చెప్పిన ఎయిర్ హోస్టెస్ (Air Hostess) వీడియో వైరల్ అవుతోంది. క్యాబిన్ సిబ్బంది తాను ఆర్డర్ చేసిన వాటిని మాత్రమే అందించగలమని, మీ కారణంగా సిబ్బంది ఏడుస్తున్నారని ఎయిర్ హోస్టెస్ ఆరోపించింది.
ఎయిర్ హోస్టెస్ (Air Hostess) తనపై ఎందుకు అరుస్తున్నారని ప్రయాణికుడు అడిగినప్పుడు, మీరే మా సిబ్బందిని వేధిస్తున్నారని అని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఎందుకు అరుస్తున్నావని ఎయిర్ హోస్టెస్ ప్రశ్నించగా ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ని (Air Hostess) “నోరు మూసుకో” మండిడ్డాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ కోపం తో. “క్షమించండి మీరు నాతో అలా మాట్లాడకూడదు. నేను కూడా ఇక్కడ ఉద్యోగిని. అందరికీ సర్వెంట్ నని, మీకు వ్యక్తిగత సర్వేంట్ మాత్రం కాదు’’ రోదిస్తూ చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది.
Tempers soaring even mid-air: "I am not your servant"
An @IndiGo6E crew and a passenger on an Istanbul flight to Delhi (a route which is being expanded soon with bigger planes in alliance with @TurkishAirlines ) on 16th December : pic.twitter.com/ZgaYcJ7vGv
— Tarun Shukla (@shukla_tarun) December 21, 2022
Related News
KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.