HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Hyderabad Gidmethla Teen Kills Mother Instagram Love

Murder: ప్రేమకు అడ్డుచెప్పిందని.. ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక

సోషల్ మీడియా పరిచయం... ప్రేమగా మారి, చివరకు ఒక కన్న తల్లిని హత్య చేసేందుకు దారితీసిన ఈ ఘటన మానవ సంబంధాల విలువల్ని ప్రశ్నించేలా ఉంది.

  • Author : Kavya Krishna Date : 24-06-2025 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

Murder: హైదరాబాద్‌ జీడిమెట్లలో ఓ అమాయక తల్లి దారుణ హత్యకు గురైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియా పరిచయం… ప్రేమగా మారి, చివరకు ఒక కన్న తల్లిని హత్య చేసేందుకు దారితీసిన ఈ ఘటన మానవ సంబంధాల విలువల్ని ప్రశ్నించేలా ఉంది.

ఈ ఘటనకు కేంద్రబిందువుగా నిలిచినది పదో తరగతి చదువుతున్న ఒక బాలిక. ఎనిమిది నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నల్గొండకు చెందిన యువకుడు శివతో పరిచయం ఏర్పడింది. యువతితో రోజు రోజుకీ సమాధానాలు పెరిగి, అది ప్రేమగా మారింది. విషయం తెలిసిన తల్లి అంజలి, “ఇప్పుడే పదో తరగతిలో ఉన్నావు, ఇలాంటి విషయాలు అవసరమా?” అంటూ మందలించింది. తల్లి అడ్డుపడుతుండటంతో ఈ బాలిక ఆమెను తన ప్రేమ బంధానికి ఆటంకంగా భావించింది.

ఇటీవల వారం రోజుల క్రితం బాలిక తన ఇంటినుంచి శివతో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన మూడురోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే ఆమె మనసులో తల్లిని తొలగించాలనే భీకర ఆలోచన వాస్తవ రూపం దాల్చింది.

నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ హైదరాబాదుకు వచ్చాడు. అప్పుడు అంజలి ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండగా శివ వెనుక నుంచి ఆమెపై దాడి చేశాడు. అతడు బెడ్‌షీట్‌తో ఆమె ముఖాన్ని కప్పగా, బాలిక తల్లి తలపై సుత్తితో కొట్టింది. అనంతరం శివ తమ్ముడు యశ్వంత్‌ కత్తితో ఆమె గొంతు కోసాడు. ఇలా ముగ్గురు కలిసి తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, హతురాలు అంజలి స్వాతంత్ర్య సమరయోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం. దేశం కోసం పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన మహిళను, ఆమె సొంత కూతురు ప్రేమ పేరుతో హత్య చేయడం సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం జీడిమెట్ల పోలీసులు ఈ హత్య కేసును విచారిస్తూ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో మారుతున్న విలువలు, తల్లిదండ్రుల పట్ల అభద్రతాభావం, చిన్న వయసులోనే ప్రేమ బంధాల్లో ఇరుక్కొనడం.. ఇవన్నీ కలసి ఇలా అమానుష ఘటనలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రిని, విద్యార్థిని ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది.

Headingley Test: లీడ్స్ చరిత్రలో అత్య‌ధికంగా చేజ్ చేసిన స్కోర్లు ఇవే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gidimetla murder
  • hyderabad crime
  • Hyderabad shocking crime
  • Hyderabad teen murder case
  • Instagram love crime
  • Mother daughter murder
  • Social media crime
  • Teen kills mother
  • Teenage love affair
  • telangana news

Related News

Kalvakuntla Kavitha New Party in April

Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

Kalvakuntla Kavitha  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్

    Latest News

    • Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌కు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన హార్దిక్ పాండ్యా

    • Lokesh : టీడీపీ ఫ్యూచర్ బాస్.. నారా లోకేషే !!

    • Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

    • TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్

    • ప్రకాష్ రాజ్ తల్లి మృతి..పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ ..ఇదే కదా పవన్ అంటే !!

    Trending News

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

      • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd