Tragedy : దారుణం.. నొప్పితో అరుస్తోందని నోట్లో వేడి కత్తి పెట్టి హింస
Tragedy : మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
- By Kavya Krishna Published Date - 10:49 AM, Tue - 26 August 25

Tragedy : మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గోన్ జిల్లా ఒక అమానుష ఘటనతో కలకలం రేపింది. భార్య కట్నం తీసుకురాలేదనే కారణంతో ఓ భర్త అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. తాళ్లతో కట్టేసి, వేడి కత్తితో శరీరంపై వాతలు పెట్టడమే కాకుండా, నొప్పితో బాధితురాలు కేకలు వేస్తుండగా ఆ కత్తిని నోట్లో పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నరకయాతన నుంచి బాధితురాలు చాకచక్యంగా తప్పించుకుని ప్రాణాలను కాపాడుకుంది. బాధితురాలు ఖుష్బూ పిప్లియా (23) తెలిపిన ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లయిన రోజు నుంచి భర్త తనను ఇష్టపడకపోగా, తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఆదివారం రాత్రి మద్యం తాగి మత్తులో ఉన్న భర్త మొదట ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అనంతరం వంటగదిలోకి ఈడ్చుకెళ్లి చేతులు, కాళ్లు కట్టి, తుపాకీ లాంటి వస్తువుతో బెదిరించాడు. తరువాత వేడి కత్తితో ఛాతీ, చేతులు, కాళ్లపై వాతలు పెట్టాడని ఆమె వాంగ్మూలంలో పేర్కొంది. “మా వాళ్లు నిన్ను బలవంతంగా ఇచ్చారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు” అంటూ దాడి చేశాడని తెలిపింది.
Ganesh Chaturthi : గణనాథుడి రూపంలోని ఆంతర్యం అదే!
ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఖుష్బూ ఆరోపించింది. అయితే ఎవరూ ఆపలేదని తెలిపింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఖుష్బూ తన కట్లను విప్పుకుని బయటకు పారిపోయింది. ఇంట్లో పనిచేసే సిబ్బంది నుంచి మొబైల్ తీసుకుని తన కుటుంబానికి సమాచారం అందించింది. వెంటనే ఆమె తండ్రి లోకేశ్ వర్మ, తన చిన్న కుమారుడిని పంపించి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఖుష్బూ నుంచి వాంగ్మూలం నమోదు చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Spirituality : పూజా గృహ నియమాలు ఏమిటి?..అగరబత్తి, పువ్వులకి వాస్తు నియమాలు ఏమిటి?