HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >How To Apply For The Rs 5 Lakh Loan Offered By The Centre To Women

Central Government Scheme : కేంద్రం మహిళలకు అందిస్తున్న రూ. 5 లక్షల రుణం కోసం ఎలా అప్లై చేయాలంటే !!

Central Government Scheme : ఈ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం సహాయక బృందాలుగా (SHG) ఏర్పడి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించబడింది.

  • By Sudheer Published Date - 05:17 PM, Sat - 12 July 25
  • daily-hunt
Central Government Scheme F
Central Government Scheme F

కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి తోడ్పడే విధంగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) ద్వారా Self Help Group – Bank Linkage Programme (SHG-BLP) పేరిట ఓ ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు స్వయం సహాయక బృందాలుగా (SHG) ఏర్పడి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించబడింది. ఈ రుణాన్ని ఉపయోగించి చిరు వ్యాపారాలు, పశుపోషణ, టైలరింగ్, క్రీడా కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వంటి వాటిని ప్రారంభించవచ్చు.

TATA Cars Life Time service : టాటా ఎలక్ట్రిక్ కార్లు.. ఈ మోడల్స్‌పై జీవితకాలం బ్యాటరీ ప్యాక్ వారంటీ!

ఈ పథకం ద్వారా మహిళలకు కేవలం రుణం మాత్రమే కాదు, అవసరమైన శిక్షణ కూడా నాబార్డ్ ద్వారా అందించబడుతుంది. ముఖ్యంగా టైలరింగ్, పెకింగ్, అగ్రో ప్రాసెసింగ్ లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న మహిళలు 10-20 మంది కలిసి SHGగా రిజిస్టర్ అయ్యి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా రూ.50,000 నుంచి ప్రారంభించి, ప్రగతికి అనుగుణంగా రుణ పరిమితి రూ.5 లక్షల వరకూ పెంచవచ్చు. ఈ రుణంపై కేంద్ర ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.3 లక్షల వరకు సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది.

Thane School : ఆ అనుమానంతో విద్యార్థినులు దుస్తులు విప్పించిన స్కూల్ ప్రిన్సిపల్‌

ఈ రుణం కోసం దరఖాస్తు చేయాలంటే.. సంబంధిత జిల్లా నాబార్డ్ కార్యాలయాన్ని సంప్రదించాలి. రుణం వ్యక్తిగతంగా కాదు, SHG పేరిట మంజూరు చేయబడుతుంది. అవసరమైన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, SHG బ్యాంక్ ఖాతా పాస్‌బుక్, సభ్యుల సంతకాలు, షరతులకు అంగీకార పత్రాలు అవసరం. రుణంపై వడ్డీ శాతం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఇది 3 శాతం వరకు ఉండవచ్చు. తిరిగి చెల్లించే కాలవ్యవధి 2 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఈ పథకం ద్వారా మహిళలు స్వయంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా తమ కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, స్వావలంబనను ప్రోత్సహించేందుకు ముందడుగు వేసింది. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని నిలకడగా మార్చుకోవచ్చు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Central Government Scheme
  • NABARD
  • Self help group bank linkage programme
  • The Self-Help Group - Bank Linkage Programme (SHG-BLP)

Related News

    Latest News

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd