BJP Dominated: ఎంఐఎం అడ్డాలో ‘బీజేపీ’ దూకుడు.. రీజన్ ఇదేనా!
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. దీంతో రెండోసారి కూడా బీజేపీకి ప్రజలు పట్టకట్టారు.
- Author : Balu J
Date : 11-03-2022 - 9:45 IST
Published By : Hashtagu Telugu Desk
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. దీంతో రెండోసారి కూడా బీజేపీకి ప్రజలు పట్టకట్టారు. మిత్రపక్షాలు అప్నా దళ్ (ఎస్) మరియు నిషాద్ పార్టీతో కలిసి 273 సీట్లు గెలుచుకుంది. సెకండ్ టర్మ్‌కు కాషాయ పార్టీ గెలిచిన సీట్లలో ఆ ఒక్క సీటు పై రాజకీయవర్గాల్లో చర్చజరుగుతుంది. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ఇస్లామిక్ సెమినరీలలో ఒకటైన దారుల్ ఉలుమ్ దేవ్‌బంద్‌కు నిలయమైన దేవ్‌బంద్‌ను వరుసగా రెండవసారి బీజేపీ గెలుచుకుంది. సహరాన్‌పూర్ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో 70% ముస్లిం జనాభా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో 40% ముస్లిం ఓటర్లు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేష్ సింగ్ తన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ కార్తికేయ రాణాపై 7,104 పోల్స్‌తో విజయం సాధించారు.
ఎంఐఎం పార్టీని దాని ప్రత్యర్థులు బీజేపీ బీ టీమ్, కాంగ్రెస్ సీ టీమ్ అంటూ కొట్టిపారేశారు. యుపి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ దూకుడు చూపించింది. 100 మంది అభ్యర్థులను నిలబెట్టింది..కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 0.43 శాతం ఓట్ల షేర్‌ను నమోదు చేసింది. దేవ్‌బంద్‌లో ఏఐఎంఐఎం అభ్యర్థి ఉమైర్ మదానీకి 3,500 ఓట్లు వచ్చాయి. బీజేపీ, ఎస్పీ అభ్యర్థుల మధ్య దాదాపు 7,000 ఓట్ల తేడా ఉంది. ఎంఐఎం తన అభ్యర్థిని నిలబెట్టకుంటే ఆ మూడు వేల బేసి ఓట్లు ఎస్పీ అభ్యర్థి గెలుపుకు సహాయపడి ఉండేవి. 2017 ఎన్నికలలో ఎంఐఎం ఈ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టలేదు.
2017లో బీజేపీకి చెందిన బ్రిజేష్ సింగ్ 1.02 లక్షల ఓట్లను సాధించారు, ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీలు బరిలోకి దిగిన ముస్లిం అభ్యర్థుల కారణంగా ఓట్ల చీలిక వల్ల ప్రయోజనం పొందారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి మాజిద్ అలీకి 72,844 ఓట్లు రాగా, ఎస్పీకి చెందిన మావియా అలీకి 55,385 ఓట్లు వచ్చాయి. కానీ ముస్లింలు అధికంగా ఉండే సీటులో, ఒక ముస్లిమేతర బీఎస్పీ అభ్యర్థి 52,000 ఓట్లకు పైగా పోల్ చేయడం వల్ల ఓట్లు మతపరమైన ప్రాతిపదికన పోల్ కాలేదని సూచిస్తున్నాయి. ఇదే జరిగి ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి రహత్ ఖలీల్‌కు ఎక్కువ ఓట్లు వచ్చేవి.