Fake PMO Official : పీఎంవో అధికారి.. ఎన్ఐఏ అధికారి.. డాక్టర్‌ను అంటూ చీట్ చేశాడు
Fake PMO Official : నేను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిని అని నమ్మించాడు.. నేను న్యూరోసర్జన్ అని నమ్మించాడు..
- By Pasha Published Date - 10:04 AM, Sun - 17 December 23

Fake PMO Official : నేను ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారిని అని నమ్మించాడు..
నేను న్యూరోసర్జన్ అని నమ్మించాడు..
నేను ఆర్మీ డాక్టర్ అని నమ్మించాడు..
నేను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారుల సన్నిహితుడిని అని నమ్మించాడు..
ఇలా లేని హోదాలను తనకు ఆపాదించుకొని అతడు అందరినీ నమ్మించాడు.. చివరకు పోలీసులకు చిక్కాడు..
We’re now on WhatsApp. Click to Join.
కాశ్మీర్‌లోని కుప్వారాకు చెందిన 37 ఏళ్ల సయ్యద్ ఇషాన్ బుఖారీని ఒడిశాకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని జైపూర్ జిల్లా నేయుల్‌పూర్ గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు వేషాలను మార్చుకొని తిరుగుతూ దేశంలో వివిధ చోట్ల ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని చీట్ చేశాడని దర్యాప్తులో గుర్తించారు. ఏకంగా పీఎంవో ఆఫీసర్ హోదాను కూడా అతడు తనకు తానుగా ప్రకటించుకోవడం గమనార్హం. అతడికి పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది వ్యక్తులతో, కేరళలోని కొన్ని అనుమానాస్పద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జె.ఎన్.పంకజ్ తెలిపారు.
మోసగాడు సయ్యద్ ఇషాన్ బుఖారీ విద్యార్హతలు అంతంతే. అయితే తాను అమెరికాలోని ప్రఖ్యాత కార్నెల్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చేశానని ప్రజలను నమ్మించి మోసగించాడు. దానికి సంబంధించిన నకిలీ మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్‌ను తయారుచేసి అందరికీ చూపించుకున్నాడు. కెనడియన్ హెల్త్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ తనకు సభ్యత్వం ఉందని, తానొక డాక్టర్‌ను అని అందరికీ చెప్పుకునేవాడు. తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ నుంచి మెడిసిన్ చేశానని కూడా చెప్పుకునేవాడు. దీనికి సంబంధించిన నకిలీ మెడికల్ సర్టిఫికెట్‌ను సయ్యద్ ఇషాన్ అందరికీ చూపించుకునేవాడు. అతడికి సంబంధించిన ప్రదేశాల్లో రైడ్స్ చేసిన ఒడిశా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు.. 100కుపైగా నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read: 3015 Jobs : 3015 రైల్వే అప్రెంటిస్ జాబ్స్.. 24 ఏళ్లలోపు వారికి ఛాన్స్
తాను పెద్ద హోదాలో ఉన్న వ్యక్తినంటూ మోసగించి సయ్యద్ ఇషాన్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కాశ్మీర్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అనేక మంది మహిళలతో ప్రేమలో ఉన్నాడని తేలింది. అనేక సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు, యాప్‌లలో యాక్టివ్‌గా ఉంటూ.. ఉన్నత హోదా కలిగిన వ్యక్తిగా తనను అందరికీ పరిచయం చేసుకొని చీటింగ్స్ చేస్తుంటాడు. తాను ఉన్నతాధికారిని అంటూ దేశంలో పలుచోట్ల ఈ మోసగాడు ఫోర్జరీ, చీటింగ్‌లకు పాల్పడ్డాడు. వాస్తవానికి ఇతడి కోసం కాశ్మీర్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. అతడిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు పోలీసులకు చిక్కినందున.. అతడిని(Fake PMO Official) పంజాబ్, కాశ్మీర్, ఒడిశా పోలీసుల సంయుక్త బృందం విచారించనుంది.