Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు తుపాకి లైసెన్స్
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ (Nupur Sharma)కు ఢిల్లీ పోలీసులు తుపాకి లైసెన్స్ మంజూరు చేశారు. నుపుర్ శర్మ ఓ టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆమెపై దేశంలోని ఇస్లామిక్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
- Author : Gopichand
Date : 13-01-2023 - 10:40 IST
Published By : Hashtagu Telugu Desk
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ (Nupur Sharma)కు ఢిల్లీ పోలీసులు తుపాకి లైసెన్స్ మంజూరు చేశారు. నుపుర్ శర్మ ఓ టీవీ షోలో ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఆమెపై దేశంలోని ఇస్లామిక్ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న నుపుర్ శర్మకు ఇటీవల తుపాకీ లైసెన్స్ మంజూరైంది.
నుపుర్ శర్మకు చాలా మంది నుండి ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వం ఆమెకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేసింది. ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు కోరుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అయితే ఆమె వ్యాఖ్యలపై వివాదం సద్దుమణగలేదు. నుపుర్ శర్మపై చాలా చోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
Also Read: 14 Soldiers Killed: ఉగ్రదాడిలో 14 మంది సైనికులు మృతి
దేశంలో ఆమెకు మద్దతుగా మాట్లాడినందుకు ఓ ఫార్మసిస్ట్, ఉదయ్‌పూర్‌లో ఓ టైలర్ హత్యకు గురయ్యారు. నుపుర్ శర్మను కూడా హతమారుస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె స్వీయ రక్షణ కోసం తుపాకి లైసెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా పోలీసులు ఆమెకు లైసెన్స్ మంజూరు చేశారు. నుపుర్ వ్యాఖ్యలపై పలు దేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. నుపుర్ శర్మ గతేడాది ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.