Financial Frauds: ఆర్థిక మోసాలకు పాల్పడిన 70 లక్షల మొబైల్‌లు డిస్‌కనెక్ట్
డిజిటల్ మోసాలను అరికట్టేందుకు, సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడిన 70 లక్షల మొబైల్ నంబర్‌లను ప్రభుత్వం డిస్‌కనెక్ట్ చేసిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.ఆర్థిక సైబర్ భద్రత మరియు పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు
- By Praveen Aluthuru Published Date - 09:45 PM, Tue - 28 November 23

Financial Frauds: డిజిటల్ మోసాలను అరికట్టేందుకు, సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు పాల్పడిన 70 లక్షల మొబైల్ నంబర్‌లను ప్రభుత్వం డిస్‌కనెక్ట్ చేసిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.ఆర్థిక సైబర్ భద్రత మరియు పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన జోషి వ్యవస్థలను బలోపేతం చేయాలని బ్యాంకులను కోరారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని, తదుపరి సమావేశం జనవరిలో జరగనుందని చెప్పారు. ఈ సమావేశంలో డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సైబర్ క్రైమ్/ఆర్థిక మోసాలకు సంబంధించిన 70 లక్షల మొబైల్ కనెక్షన్‌లు ఇప్పటివరకు డిస్‌కనెక్ట్ అయినట్లు తెలిపారు. దీని ద్వారా దాదాపు రూ.900 కోట్ల మోసపోయిన డబ్బు ఆదా అయిందని, 3.5 లక్షల మంది బాధితులకు లబ్ధి చేకూరిందని తెలిపారు.
Also Read: World Expo 2030: వరల్డ్ ఎక్స్‌పో 2030కి ఆతిథ్యం ఇచ్చేందుకు రియాద్