9144 Jobs : రైల్వేలో 9144 జాబ్స్.. నెలకు రూ.30వేల జీతం
9144 Jobs : రైల్వేశాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- By Pasha Published Date - 12:45 PM, Sun - 10 March 24
9144 Jobs : రైల్వేశాఖ 9144 ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ టెక్నీషియన్ పోస్టులే. 1092 టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులు, 8052 టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎంపికయ్యే అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో జాబ్ చేయాల్సి ఉంటుంది. పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసిన వారు అప్లై చేయొచ్చు.
Also Read : Miss World 2024 : ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా గొప్ప పనులు.. తెలుసా ?
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు అప్లై చేసేవారి వయసు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ పోస్టులకు అప్లై చేసేవారి వయసు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి. మహిళలు, మాజీ సైనికులు, ఈబీసీ, మైనారిటీ, ట్రాన్స్జెండర్, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
- టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 వేతనం ఉంటుంది.
- టెక్నీషియన్ గ్రేడ్-3 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join
- ఈ పోస్టులకు(9144 Jobs) అప్లై చేసే అభ్యర్థులకు ఫస్ట్, సెకండ్ స్టేజ్ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి.. క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
- అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు రుసుము ఆన్లైన్లోనే చెల్లించాలి.
- ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 18.
Also Read :DSC Hall Tickets : 25 నుంచి డీఎస్సీ హాల్టికెట్లు.. ఎగ్జామ్ కొత్త షెడ్యూల్
సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఏడాది ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ల్లోని సబ్-ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో 4001 సబ్-ఇన్స్పెక్టర్ (జీడీ) పోస్టులు, ఢిల్లీ పోలీస్ (పురుషులు)లో 125 సబ్-ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు, ఢిల్లీ పోలీస్ (మహిళలు)లో 61 సబ్-ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేదీ మార్చి 28.
Also Read : Fake Video : ‘Hashtagu ‘ పేరుతో దుష్ప్రచారం..
Related News
Central Armed Forces : కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో 506 జాబ్స్
Central Armed Forces : డిగ్రీ పట్టాతో పాటు నిర్ణీత శారీరక ప్రమాణాలున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.