Shirdi Trains : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్ తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
Shirdi Trains : జూలై 3 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు వెళ్లే 07007 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి గురువారం నడవనుంది
- By Sudheer Published Date - 07:17 PM, Sun - 22 June 25

షిర్డీ (Shirdi ) సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త తెలిపింది. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ – నాగర్‌సోల్ (Secunderabad – Nagarsol)మధ్య ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జూలై 3 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి నాగర్‌సోల్‌కు వెళ్లే 07007 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి గురువారం నడవనుంది. రాత్రి 9.20కి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45కి గమ్యస్థానానికి చేరుకుంటుంది.
Congress Govt : మాది చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు – పొంగులేటి
అలాగే నాగర్‌సోల్ నుంచి సికింద్రాబాద్‌కు తిరిగే 07002 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.30కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చెల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, నాందెడ్, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్ వంటి స్టేషన్లలో ఆగనుంది.
ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవడం ద్వారా ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మలచుకోవచ్చు. సాయిబాబా భక్తుల కోసం వేసవి రద్దీ సమయంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తేనందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకోవడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.