Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..!
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? మరి ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా? ఇటీవల వరుసగా భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. తాజాగా మాత్రం ఒక్కసారిగా పుంజుకున్నాయి. వారాంతంలో రేట్లు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ సహా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్ల గురించి తెలుసుకుందాం.
- By Kavya Krishna Published Date - 10:36 AM, Sun - 22 December 24

Gold Price Today : బంగారం ధరలు మరోసారి పెరిగి పసిడి ప్రియులను ఉత్కంఠకు గురిచేశాయి. గత వారం రోజుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే ధరలు పెరగగా, ఇప్పుడు మరోసారి వేగంగా ఎగబాకాయి. ముఖ్యంగా డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో బంగారం ధరలు తగ్గినా, ప్రస్తుతం తిరిగి పెరిగాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు పెరుగుతున్నాయి.
శని, ఆదివారాల్లో గోల్డ్ రేట్లు మార్పు చెందకపోవడం సాధారణమయినా, సోమవారం నాటి పరిస్థితులు దాని రేటును ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2623.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 29.56 డాలర్లకు చేరుకుంది. రూపాయి మారకం విలువ కూడా స్వల్పంగా పుంజుకుని ప్రస్తుతం రూ. 84.988 వద్ద ఉంది.
దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి, తులం రూ. 71,000కి చేరింది. గతంలో వరుసగా రూ. 300, రూ. 650, రూ. 150 తగ్గిన ధరలు, ఇప్పుడు మళ్లీ పెరుగుతూ కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 650 పెరిగి, 10 గ్రాముల రేటు రూ. 77,450కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేట్లు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి, తులానికి రూ. 71,150కి చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 650 పెరిగి 10 గ్రాముల రేటు రూ. 77,600కి చేరింది.
వెండి ధరల్లో కూడా పెరుగుదల
బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో వెండి రేటు ఒక్కరోజులోనే రూ. 1,000 పెరిగి, కిలో వెండి ధర రూ. 91,500కి చేరింది. హైదరాబాద్‌లోనూ వెండి ధరలు పెరిగి, ప్రస్తుతం కిలోకు రూ. 99,000కి చేరాయి.
బంగారం, వెండి ధరలు ప్రాంతాలవారీగా మారుతుంటాయి. స్థానిక పన్నులు, ఇతర ఆర్థిక అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, రూపాయి మారకం విలువ, డాలర్ బలహీనత వంటి అంశాలు ఈ మార్పులకు ప్రధాన కారణాలు.
(గమనిక : మరింత సమాచారం కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.)
Read Also : 16 Psyche Asteroid : భూమిపై అందరినీ కుబేరులుగా మార్చే ‘16సైకీ’.. ఎలా ?