HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gautam Adanis Incident I Was Abducted I Have Seen Death Closely 2 Times

Gautam Adani: నేను కిడ్నాప్ కు గురయ్యాను.. మరణాన్ని 2 సార్లు దగ్గరగా చూశాను : గౌతమ్ అదానీ

Gautam Adani: మన చేతిలో లేని వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అంటున్నారు.

  • By hashtagu Published Date - 01:42 PM, Sun - 8 January 23
  • daily-hunt
Adani-Hindenburg Case
Adani Imresizer

Gautam Adani: మన చేతిలో లేని వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అంటున్నారు. తాను ఇదే సూత్రంపై ఆధారపడి పని చేస్తానన్నారు. గౌతమ్ అదానీ గతంలో చాలా ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడ్డారు. 1997లో గౌతమ్ అదానీ కిడ్నాప్ జరిగింది. ఇది కాకుండా, 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలోనూ అదానీ తాజ్ హోటల్‌లో చిక్కుకున్నారు.

బాధపడాల్సింది ఏమీ లేదు…

గౌతమ్ అదానీ శనివారం ఒక ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తన కిడ్నాప్, 26/11 ముంబై దాడికి సంబంధించిన భయానక విషయాల్ని వివరించారు.  తన జీవితంలో రెండు సార్లు మరణాన్ని చాలా దగ్గరగా చూశానని గౌతమ్ అదానీ చెప్పారు. తన కిడ్నాప్ గురించి గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘చెడు సమయాన్ని మరచిపోవడమే మంచిది. ప్రతి పరిస్థితికి నన్ను నేను అలవాటు చేసుకుంటాను. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే నన్ను విడుదల చేశారు. కానీ నేను అపహరణకు గురైన రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను. ఎందుకంటే చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా చింతించడం వల్ల ప్రయోజనం ఉండదు” అని వివరించారు.అదానీ మాట్లాడుతూ.. “ఎవరూ తమ చేతిలో లేని దాని గురించి ఆందోళన చెందకూడదని నేను నమ్ముతాను. విధి తనంతట తానుగా అన్నీ నిర్ణయించుకుంటుంది” అని చెప్పారు.

తాజ్ హోటల్‌లో ఎలా గడిపామంటే..

2008 నవంబర్ 26న ఉగ్రదాడి సమయంలో తాజ్ హోటల్‌లో తాను కూడా ఉన్నానని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఏదోలా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. దుబాయ్‌కి చెందిన ఒక స్నేహితుడితో కలిసి తాజ్‌ హోటల్‌కు భోజనానికి వెళ్లానని తెలిపారు.  ఉగ్రవాదులు కాల్పులు జరిపే భయానక దృశ్యాన్ని చాలా దగ్గరగా చూశాను. కానీ భయపడలేదు.. ఎందుకంటే భయపడటం వల్ల ఏమీ జరగదు.
ఆ సంఘటన గురించి వివరిస్తూ.. “హోటల్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లబోతుండగా, ఉగ్రవాద దాడి జరిగిందనే వార్త తెలిసింది. ఆ రోజు రాత్రంతా భయాందోళనలో హోటల్ రూమ్ లోనే గడిపాను. నేను ఒకవేళ కొన్ని నిమిషాల ముందు రూమ్ బయటికి వెళ్లి ఉంటే, బహుశా ఏదైనా చెడు జరిగి ఉండేది. చివరకు హోటల్ సిబ్బందితో కలిసి మేడపైకి వెళ్లాను. మరుసటి రోజు ఉదయం 7 గంటల తర్వాత కమాండోల రక్షణ లభించడంతో మేం హోటల్ బయటికి బయలుదేరగలిగాం” అని వివరించారు.

విజయానికి కీలకం అదే..

కష్టపడి పనిచేయడం ఒక్కటే విజయానికి కీలకం అని గౌతమ్ అదానీ అన్నారు.దేశంలోని 22 రాష్ట్రాల్లో తమ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు.  తనపై కొందరు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే అలాంటి ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ బిడ్డింగ్ లేకుండా ఏ వ్యాపారంలోకి ప్రవేశించలేదని ఆయన చెప్పారు. ఓడరేవు, విమానాశ్రయం, పవర్ హౌస్ ఇలా అన్ని చోట్లా నిబంధనల ప్రకారం పనులు జరిగాయన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడని, ఆయన కూడా దేశ ప్రగతిని కోరుకుంటున్నారని, ఆవేశంతో ఏదైనా మాట్లాడినా అభివృద్ధికి వ్యతిరేకం కాదని గౌతం అదానీ అన్నారు. రాజస్థాన్‌లోని అదానీ ప్రాజెక్టును కూడా రాహుల్ ప్రశంసించారని గుర్తు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adani group
  • Adani story
  • Guatam Adani

Related News

RCB Franchise

RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయినప్పటికీ RCB గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి కప్ దక్కలేదు.

    Latest News

    • AR Rahman Concert : రామోజీ ఫిలిం సిటీ లో అట్టహాసంగా జరిగిన రెహమాన్‌ కాన్సర్ట్‌

    • 2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్

    • Tragedy : మెదక్ లో దారుణం..కన్న పేగు బంధానికి మాయని మచ్చ

    • Jubilee Hills Bypoll Campaign : మూగబోయిన జూబ్లీహిల్స్

    • Kumki Elephants Camp : కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్

    Trending News

      • Digital Gold: డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతున్నారా? మీకొక షాకింగ్ న్యూస్‌!

      • IND vs AUS: భార‌త్‌- ఆస్ట్రేలియా మ్యాచ్ ర‌ద్దు కావ‌డానికి కార‌ణం పిడుగులేనా?

      • Strong Room: ఎన్నిక‌ల త‌ర్వాత ఈవీఎంల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో ఎందుకు ఉంచుతారు?

      • Junio Payments: బ్యాంకు ఖాతా లేకుండానే యూపీఐ.. పిల్లలు కూడా ఆన్‌లైన్ చెల్లింపులు చేయొచ్చు!

      • Abhishek Sharma: సూర్య‌కుమార్ యాద‌వ్ రికార్డును బ్రేక్ చేసిన యంగ్ ప్లేయ‌ర్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd