COVID-19 vaccination : ఇకపై తగ్గనున్న రెండు డోసుల మధ్య వ్యత్యాసం..
భారత్ ఇటీవలే వ్యాక్సిన్ డోసుల 100కోట్ల మార్కును దాటేసింది. అయితే ఇండియాలో ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిషీల్డ్ డోసుల మధ్య దూరం తగ్గించడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది.
- By Hashtag U Published Date - 10:51 AM, Mon - 25 October 21

భారత్ ఇటీవలే వ్యాక్సిన్ డోసుల 100కోట్ల మార్కును దాటేసింది. అయితే ఇండియాలో ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిషీల్డ్ డోసుల మధ్య దూరం తగ్గించడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది. భారత్ వందకోట్ల వ్యాక్సినేషన్ మార్కు దాటి.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ల పంపిణీలో రెండవ స్థానంలో నిలిచింది. అయితే కనీసం ఒక డోస్, రెండు డోస్‌లు పొందిన జనాభా నిష్పత్తి మధ్య వ్యత్యాసం మాత్రం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా టీకా ధోరణులను మ్యాప్ చేసే బ్లూమ్‌బెర్గ్ ట్రాకర్ ప్రకారం, చైనా జనాభాలో 82% మందికి కనీసం ఒక మోతాదు.. 76% మందికి రెండు డోస్‌లు అందాయి. యునైటెడ్ స్టేట్స్‌లో 66.2% మందికి ఫస్ట్ డోస్ పూర్తవగా.. 57.3% మంది రెండు డోసులు తీసుకున్నారు. యూరోపియన్ యూనియన్ 69% మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 66% రెండో డోస్ తీసుకున్నారు. అయితే, ఇండియాలో మాత్రం ఈ తేడా 51% మంది ఫస్ట్ డోస్ తీసుకోగా.. 21.9% మందికి మాత్రమే రెండు డోసులు పూర్తయ్యాయి. ఇది ఆలోచించాల్సిన విషయంగా నిపుణులు చెబుతున్నారు.
భారత్ లో ఉన్నట్లుగా కోవిషీల్డ్ యొక్క రెండు మోతాదుల మధ్య తేడా 12-16 వారాల వ్యవధి అనేది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్‌ల యొక్క రెండు షాట్‌ల మధ్య డోసేజ్ గ్యాప్ నాలుగు వారాలు ఉండగా.. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఎనిమిది వారాల గ్యాప్‌లో ఇస్తున్నారు. దీంతో అక్టోబర్ 23 న, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమై.. టీకా వేగాన్ని వేగవంతం చేయమని అధికారులను కోరారు. ముఖ్యంగా రెండో డోసు వేసుకున్న వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏది ఏమైనప్పటికీ, టీకా డేటాను పరిశీలిస్తే, సెప్టెంబర్ 17 తర్వాత, దేశంలో ఒకే రోజు 2.5 కోట్ల వ్యాక్సినేషన్‌లు ఆల్‌టైమ్‌గా నమోదు కాగా, వ్యాధి నిరోధక టీకాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఒక నెలకు పైగా, వారానికోసారి వేసే వ్యాక్సిన్‌ల సంఖ్య సెప్టెంబర్ 11-17 వారంలో 6.6 కోట్ల నుండి అక్టోబర్ మొదటి వారంలో 4.2 కోట్లకు మరియు అక్టోబర్ 16-22 వారంలో 3.6 కోట్లకు పడిపోయింది. అయితే ఇదే టైమ్ లో రెండో డోస్‌ల వాడకం పెరిగింది. వాస్తవానికి, మే 8-14 నుండి మొదటిసారిగా, రెండవ మోతాదుల వారపు సంఖ్య సింగిల్ డోస్‌లను మించిపోయింది. 1.5 కోట్ల మొదటి డోస్‌లతో పోలిస్తే గత వారంలో 2.1 కోట్ల రెండవ డోసులు అందించబడ్డాయి. అయితే మొదటి డోస్‌లు పొందుతున్న వారి సంఖ్య నాలుగు కోట్ల నుంచి 1.5 కోట్లకు పడిపోయింది. డిసెంబర్ కల్లా దాదాపు 94 కోట్ల మందికి పూర్తిగా టీకాలు వేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రోజుకు కోటి డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుంది
Related News

Swacchata Hi Seva 2023: రెజ్లర్ అంకిత్ తో ప్రధాని మోడీ స్వచ్ఛత కార్యక్రమం
అక్టోబరు 1న స్వచ్ఛత ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వీడియోను షేర్ చేసి ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ రెజ్లర్ అంకిత్ తో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు.