Jaya Prada – Jail Sentence : జయప్రదకు ఆరు నెలల జైలుశిక్ష.. ఎందుకంటే..?
ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు (Jaya Prada) ఆరు నెలల జైలు శిక్ష పడింది . ఈమేరకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు తీర్పు ఇచ్చింది.
- Author : Pasha
Date : 12-08-2023 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
Jaya Prada – Jail Sentence : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష పడింది .
ఈమేరకు చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు తీర్పు ఇచ్చింది.
జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఈ శిక్షను ఖరారు చేసింది.
రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి జరిమానా కూడా విధించింది.
Also read : Locusts: బికనీర్‌లో పెరిగిన మిడతల సంచారం.. ఆందోళనలో రైతన్నలు..!
జయప్రద (Jaya Prada) చెన్నైలోని రాయపేటలో గతంలో ఓ సినిమా థియేటర్ నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్ పనులు చూసుకునేవారు. తొలుత బాగా లాభాలు వచ్చినా తర్వాత రాబడి తగ్గడంతో పాటు ఆ థియేటర్ ను మూసేశారు. ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. థియేటర్ మూసివేయడంతో తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. వాటిని కార్మికులకు అందజేయలేదు.
దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించారు. సదరు బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. నాటి థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. కార్మికుల నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ డబ్బులను తిరిగి వారికి చెల్లించలేదని వాదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ జయప్రద (Jaya Prada) తదితరులు దాఖలు చేసిన మూడు పిటిషన్లను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.
ఆ డబ్బులను కార్మికులకు తిరిగి అందిస్తామని చెప్పినా కోర్టు అంగీకరించలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎగ్మోర్ న్యాయస్థానం జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలుశిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.