HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >For Twitter And Youtube Sensational Orders Of The Center

Central Govt: ట్విటర్, యూట్యూబ్‌లకు..కేంద్రం సంచలన ఆదేశాలు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ డాక్యుమెంటరీలోని మొదటి భాగానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోల లింక్‌లను జత చేసి ఇచ్చిన సుమారు 50 ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ను కోరినట్లు సమాచారం.

  • Author : Hashtag U Date : 22-01-2023 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Resizeimagesize (1280 X 720) 11zon
Resizeimagesize (1280 X 720) 11zon

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని ట్విటర్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది.ఈ డాక్యుమెంటరీలోని మొదటి భాగానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోల లింక్‌లను జత చేసి ఇచ్చిన సుమారు 50 ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విటర్‌ను కోరినట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రచారాస్త్రమని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ డాక్యుమెంటరీని కేంద్ర హోం, విదేశాంగ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు.

భారత దేశ సుప్రీంకోర్టు అధికారం,విశ్వసనీయతలపై దాడి చేసేందుకు దీనిలో ప్రయత్నించారని వీరు నిర్థరించారు. భారత దేశ సార్వభౌమాధికారం, అఖండత, సమగ్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందని గుర్తించారు. దీనివల్ల విదేశాలతో భారత దేశ స్నేహ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అదే విధంగా భారత దేశంలో ప్రజాశాంతికి విఘాతం కలిగే అవకాశం ఉందని గుర్తించారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను ట్విటర్‌, యూట్యూబ్‌ లకు జారీ చేసింది.

ఈ ఆదేశాలను ఈ రెండు కంపెనీలు పాటించాయి.ఈ డాక్యుమెంటరీని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ నిర్మించింది. దీనిలోని మొదటి భాగాన్ని బ్రిటన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ బీబీసీ (BBC) చానల్‌లో మంగళవారం ప్రసారం చేశారు, రెండో భాగాన్ని ఈ నెల 24న ప్రసారం చేస్తారు. ఇది ప్రోపగాండా పీస్ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో నిష్పాక్షికత లేదని, వలసవాద ఆలోచనా ధోరణి దీనిలో కనిపిస్తోందని మండిపడింది. ఈ డాక్యుమెంటరీని మన దేశంలోని బీబీసీ చానల్ ప్రసారం చేయడం లేదు.

అయితే కొన్ని యూట్యూబ్ చానళ్లు భారత దేశ వ్యతిరేక ఎజెండాతో అప్‌లోడ్ చేశాయి. దీనిని మళ్లీ అప్‌లోడ్ చేస్తే వెంటనే బ్లాక్ చేయాలని యూట్యూబ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా ట్విటర్‌కు ఇచ్చిన ఆదేశాల్లో, ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్వీట్లు, ఇతర ప్లాట్‌ఫారాలపైనగల దీని వీడియోల లింక్‌లను బ్లాక్ చేయాలని పేర్కొంది.ఈ ఆదేశాల ప్రభావం కనిపించడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మైనారిటీలపై మోదీ వైఖరిని బయటపెట్టిన బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన తన ట్వీట్‌ను ట్విటర్ డిలీట్ చేసిందని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • Sensational Orders
  • twitter
  • youtube

Related News

Private companies enter the nuclear sector.. 'Peace' Bill approved in Lok Sabha

ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్‌సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం

ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

  • Esic Hospital

    తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Latest News

  • మంచు మ‌నోజ్ మూవీలో రామ్ చ‌ర‌ణ్‌.. నిజ‌మేనా?

  • ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్‌ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!

  • ‎శీతాకాలంలో చల్లని నీరు తాగుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

  • కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd