Union Budget 2025 : చరిత్ర సృష్టిస్తున్న నిర్మలా సీతారామన్
Union Budget 2025 : వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు
- By Sudheer Published Date - 10:06 AM, Sat - 1 February 25

2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) నేడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా చరిత్రకెక్కనున్నారు. ఇక మొత్తంగా ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ పీఎం మొరార్జీ దేశాయ్ (10సార్లు) పేరిట ఉంది. ప్రస్తుత కేంద్ర సర్కారుకు ఇంకో నాలుగేళ్ల గడువు ఉండటంతో ఆ రికార్డునూ నిర్మలా సీతారామన్ అవకాశం ఉంది. 2019లో భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్.. ఇప్పుడు 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2019లో మధ్యంతర బడ్జెట్‌తో నిర్మలా బడ్జెట్.. తర్వాత 2020, 2021, 2022, 2023, 2024 (ఓటాన్ అకౌంట్ బడ్జెట్), 2024 (మధ్యంతర బడ్జెట్) తదితర సార్లు కొనసాగాయి.
Red Briefcase : బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎరుపు రంగులోనే ఎందుకు ? ఎన్నో కారణాలు
మొట్టమొదటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ హయాంలో కూడా ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన మొరార్జీ దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. వరుసగా 6 సార్లు మాత్రమే పద్దు సమర్పించారు. వరుసగా కాకుండా.. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మొరార్జీ దేశాయ్ (10 సార్లు) ముందున్నారు. తర్వాత పి.చిదంబరం (9 సార్లు) రెండో స్థానంలో ఉన్నారు. మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ (8 సార్లు) మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్.. ఆయన సరసన నిలవనున్నారు. సీడీ దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా 7 సార్లు చొప్పున బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన్మోహన్ సింగ్, జైట్లీ .. 5 సార్లు బడ్జెట్ సమర్పించారు. అయితే ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా కూడా నిర్మలా ఉన్నారు. బడ్జెట్ వేళ సుదీర్ఘ సమయం ప్రసంగించిన రికార్డు కూడా నిర్మలాదే కావడం విశేషం.