Jalandhar : యజమాని పనిలో నుంచి తీసేశాడని..తలెత్తుకోలేని పనిచేసింది
- By Sudheer Published Date - 04:45 PM, Sat - 23 September 23

కొంతమంది ఆవేశంలో..పగతో చేసిన పని సభ్య సమాజంలో తలెత్తుకోకుండా చేస్తుంటాయి. తాజాగా పంజాబ్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. యజమాని పనిలో నుండి తీసేశాడనే కోపం తో సదరు వర్కర్..ఏకంగా యజమాని ప్రవైట్ వీడియో ను నెట్ లో పోస్ట్ చేసి తన పగని తీర్చుకుంది. ఆ వీడియో వైరల్ కావడం తో సదరు యజమాని చూసి..పోలీసులకు పిర్యాదు చేసాడు. ఆ వీడియో పోస్ట్ చేసింది గతంలో అతడి దగ్గర పనిచేసిన మహిళ అని తెలిసి మరింత షాక్ అయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్‌లోని జలంధర్ (Jalandhar )లో ఓ జంట రీసెంట్ గా పిజ్జా షాప్ (Pizza Shop) ను ప్రారంభించారు. అందులో ఓ యువతి పనికి చేరింది. కొద్దీ రోజుల తర్వాత సదరు యువతీ ప్రవర్తన నచ్చక షాపు యజమాని ఆమెను విధుల నుంచి తొలగించాడు. దీంతో అతనిపై కక్ష గట్టిన ఆ యువతిని అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. పిజ్జాషాపు యజమాని జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియోను (private videos) నెట్టింట్లో పోస్ట్ చేయడమే కాదు.. మరికొన్ని వీడియోస్ తనవద్ద ఉన్నాయని..వాటిని పోస్ట్ చేయకుండా ఉండాలంటే..రూ.20 వేలు ఇవ్వాల్సిందే ( Ex-employee had demanded Rs 20,000) అంటూ డిమాండ్ చేసింది. దీంతో షాప్ యజమాని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాక్ ఇచ్చే నిజాలు తెలిశాయి. పిజ్జా షాపులో గతంలో పనిచేసిన తనీషా అనే అమ్మాయే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తేలింది. దీంతో ఆమెతో పాటు ఆమెకు సాయం చేసిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ ప్రవైట్ వీడియోస్ ఎక్కడి నుండి తీసావ్ అని ప్రశ్నిస్తే..షాప్ లోనే తీసినట్లు..అవి కూడా షాప్ ఓపెన్ అయినా కొత్తలో తీసినట్లు తెలిపింది.
Read Also : Power Sure to TDP : వచ్చే ఎన్నికల్లో YCP తిరుగులేని ఓటమి! లాజిక్ ఇదే..!