Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడులు
Bhupesh Baghel : ఈ ఏడాది మార్చిలో భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పై లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు జరిపిన విషయం తెలిసిందే
- Author : Sudheer
Date : 18-07-2025 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ భిలాయ్ (Bhupesh Baghel) నివాసంపై శుక్రవారం ఈడీ (ED) అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారికంగా ఈ దాడులు ఎలాంటి కేసులో జరిగాయో వెల్లడించకపోయినా, ఇవి రాజకీయ ప్రేరణతో జరిగాయని బఘేల్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు కావడం గమనార్హం.
Fahadh Faasil : ఫహద్ ఫాసిల్ చేతిలో కీప్యాడ్ ఫోన్.. ధర తెలిస్తే షాకే..!
భూపేశ్ బఘేల్ కార్యాలయం సోషల్ మీడియా ‘X’ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “నేడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు. రాయ్‌గఢ్ జిల్లా తంనార్ తాలూకాలో అడానీ కోసం చెట్లు నరికే అంశాన్ని సభలో ప్రస్తావించాల్సి ఉంది. కానీ సభకు కొద్ది గంటల ముందు భిలాయ్ నివాసానికి ఈడీని పంపించారు” అని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ ఏడాది మార్చిలో భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పై లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాడులు జరిపిన విషయం తెలిసిందే. చైతన్య బఘేల్‌పై ఆర్థిక నేరాల ద్వారా లభించిన డబ్బుకు లబ్దిదారుడిగా అనుమానాలు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. అదే సమయంలో మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ కూడా భూపేశ్ బఘేల్ ఇంటిపై దాడులు జరిపింది. కేంద్ర సంస్థలు చట్టానికి ప్రకారం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో వ్యవహరిస్తున్నాయని బఘేల్ ఆరోపిస్తున్నారు.