Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
- By Pasha Published Date - 11:58 AM, Sat - 1 June 24

Driving License : డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చేశాయి. వీటి ప్రకారం.. ఇకపై మనం లైసెన్సు కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రైవింగ్ ట్రైనింగ్ నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఫీజుల వివరాలివీ..
ఇకపై మనం డ్రైవింగ్ టెస్ట్ (Driving License) కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్లొచ్చు. వాళ్లు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి ఆర్‌టీఓ ఆఫీస్‌లో సమర్పించి డ్రైవింగ్ లైసెన్సును పొందొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇందుకోసం https://parivahan.gov.in. వెబ్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. ఫీజుల విషయానికి వస్తే.. లెర్నర్ లైసెన్స్ – రూ.200, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ – రూ.200, ఇంటర్నేషనల్ లైసెన్స్ – రూ.1000, పర్మినెంట్ లైసెన్స్ – రూ.200, పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ – రూ.200, డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ – రూ.10,000, డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్ ఫీజు రూ.5000 ఉంటుంది.
Also Read :Salman Khan : సల్మాన్‌ఖాన్ కారుపై కాల్పులకు స్కెచ్.. పాక్ నుంచి తుపాకులు!
వేగంగా నడిపితే అంతే సంగతి
కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా మితిమీరిన వేగంతో బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. ఆ వాహన యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును క్యాన్సిల్ చేస్తారు. పట్టుబడిన మైనర్‌కు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు.
Also Read : Israel Vs Gaza : ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అమెరికా ప్రపోజల్.. ఏమిటది ?
డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తారా ?
- ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని భావించే వారికి కనీసం ఎకరం భూమి ఉండాలి.
- ఫోర్-వీలర్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించే వారికి కనీసం 3 ఎకరాల భూమి ఉండాలి.
- అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు మాత్రమే లైసెన్స్ లభిస్తుంది.
- ఈ ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లలో ఉన్న ట్రైనర్లు డ్రైవింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి. వారికి కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్‌పై అవగాహన ఉండాలి.
- లైట్ మోటార్ వెహికల్ ట్రైనింగ్ నాలుగు వారాల్లో పూర్తి చేయాలి.
- హెవీ మోటార్ వెహికల్స్ ట్రైనింగ్ 6 వారాల్లో పూర్తి చేయాలి.