USSD : యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డింగ్‌ను ఆపేయండి.. టెలికాం కంపెనీలకు ఆర్డర్
USSD : టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కీలక సూచనలు చేసింది.
- By Pasha Published Date - 04:04 PM, Sat - 30 March 24

USSD : టెలికాం కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కీలక సూచనలు చేసింది. USSD ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సౌకర్యాలను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం కంపెనీలను నిర్దేశించింది. ఇంతకీ ఎందుకో తెలుసా ?
We’re now on WhatsApp. Click to Join
ప్రస్తుతానికి మొబైల్ ఫోన్ల వినియోగదారులు *401# నంబరుకు డయల్ చేసి కాల్ ఫార్వర్డింగ్(USSD) సేవలను వాడుకుంటున్నారు. అయితే ఈ సేవలను కొందరు హ్యాకర్లు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర టెలికాం శాఖ గుర్తించింది. కొంతమంది వినియోగదారులు అసంబద్ధ కార్యకలాపాల్లో USSD సదుపాయాన్ని వాడుతున్నారని వెల్లడించింది. కాల్ ఫార్వర్డింగ్ పద్ధతిని ఉపయోగించి మోసం చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.
Also Read :Freshers Hiring : టీసీఎస్‌లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ షురూ.. వివరాలివీ
దడ పుట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు
- సైబర్ కేటుగాళ్లు టెలికాం సబ్‌స్క్రైబర్‌కు కాల్ చేసి తమను తాము కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా, టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్‌గా పరిచయం చేసుకుంటున్నారు.
- ‘‘మీ సిమ్ కార్డ్‌లో సమస్య ఉంది. *401# కోడ్‌ను డయల్ చేసి ఫార్వర్డింగ్‌ను యాక్టివేట్ చేయండి’’ అని చెబుతారు.
- ఆ మాటలను నమ్మి ఎవరైనా పైన మనం చెప్పుకున్న కోడ్‌ను ఫోనులో డయల్ చేస్తే.. ఆ తర్వాత ఇన్‌కమింగ్ కాల్స్ నేరుగా నేరస్తుల మొబైల్ నంబర్‌కు ఫార్వర్డ్ అవుతాయి.
- ఇలాంటి కేసులు ఇటీవల కాలంలో మనదేశంలో చాలానే నమోదవుతున్నాయి.
- ఈ తరహా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కాల్ ఫార్వర్డింగ్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతులకు మారాలని నిర్దేశించింది.
- USSD ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సౌకర్యాలను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది.
Also Read : Rat Glue Traps : ఎలుకలు పట్టే ప్యాడ్లు ఈ-కామర్స్ సైట్ల నుంచి ఔట్.. ఎందుకు ?
ఏమిటీ యూఎస్‌ఎస్‌డీ ?
USSD (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) అనేది మెసేజ్‌లను జీఎస్‌ఎమ్ సెల్‌ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్ కంప్యూటర్లతో టెక్స్ట్ సందేశాల ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ప్రొటోకాల్. అంటే సాధారణంగా మన మొబైల్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి వాడే నంబర్ ఇది. వివిధ రకాల సర్వీసుల కోసం ఆయా టెలికాం సంస్థలు యూఎస్‌ఎస్‌డీ నంబర్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి.