Single KYC : ‘వన్ నేషన్.. వన్ కేవైసీ’.. త్వరలోనే మార్గదర్శకాలు !
Single KYC: బ్యాంకు.. ఆధార్ సెంటరు.. మీ సేవా సెంటరు.. సహా చాలా చోట్లకు వెళ్లినప్పుడు మనం వినే పదం ‘కేవైసీ’.
- By Pasha Published Date - 03:12 PM, Mon - 11 December 23

Single KYC: బ్యాంకు.. ఆధార్ సెంటరు.. మీ సేవా సెంటరు.. సహా చాలా చోట్లకు వెళ్లినప్పుడు మనం వినే పదం ‘కేవైసీ’. ‘కేవైసీ’ అంటే ‘నో యువర్ కస్టమర్’. చాలా గవర్నమెంట్ స్కీంల ద్వారా లబ్ధిపొందేందుకు కూడా కేవైసీ అవసరమే. ప్రతీ ఫైనాన్షియల్ సర్వీసుకు సైతం ‘కేవైసీ’ మస్ట్. ఇలా ప్రతీచోటా వేర్వేరుగా కేవైసీలు చేయిస్తూ ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు. ఈ అసౌకర్యాన్ని తొలగించే దిశగా కేంద్ర సర్కారు అడుగులు వేస్తోంది. అన్ని రకాల ఆర్థికపరమైన సేవలకు ఒకే కేవైసీ (Single KYC) ఉండేలా చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్ర సర్కారు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఒక్కసారి మనం ఎక్కడైనా కేవైసీ చేయిస్తే.. దాన్నే ఇతర సంస్థలు అవసరాలకు తగినట్లుగా ఎన్నిసార్లైనా వాడుకునే వీలును కల్పించడమే సింగిల్ కేవైసీ(Single KYC) లక్ష్యం. ఫలితంగా మనం వివిధ అవసరాల కోసం పదే పదే కేవైసీ చేయించాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఆర్థిక సంస్థలకు పేపర్ వర్క్, బిజినెస్ కాస్ట్ కూడా తగ్గిపోతాయి. కాగా, వచ్చే ఏడాది చివరికల్లా సింగపూర్, అమెరికాలలోనూ భారత్‌కు చెందిన యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయని అంటున్నారు.