Delivery Boy: నోయిడాలో దారుణం, ఒంటరిగా ఉన్న యువతిపై డెలివరీ బాయ్ రేప్!
ఓ డెలివరీ బాయ్ యువతిని రేప్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది.
- By Balu J Published Date - 01:15 PM, Mon - 30 October 23
Delivery Boy: ఉద్యోగ అవకాశాలు లభించకపోవడంతో చాలామంది యువత డెలివరీ బాయ్స్ గా మారుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగం చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు. అయితే ఒకరు, ఇద్దరి కారణంగా మంచిగా విధులు నిర్వహించే బాయ్స్ పై చెడు ప్రభావం పడుతోంది. తాజాగా గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్ మెంట్ లో ఆర్డర్‌ను తీసుకోవడానికి డోర్ తెరిచిన సమయంలో 19 ఏళ్ల యువతిపై డెలివరీ బాయ్ రేప్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ ఉదయం మొబైల్ యాప్‌లో పాలు, గుడ్లు ఆర్డర్ చేసి డెలివరీ చేసే వ్యక్తి వచ్చేసరికి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించిన గ్రేటర్ నోయిడా గ్రామానికి చెందిన డెలివరీ బాయ్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత పరారీలో ఉన్నాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అతడ్ని కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ఖైర్పూర్లో నిందితుడిని అరెస్టు చేసి సెక్టార్ 3కి చేరుకోగానే ప్రభుత్వ పిస్టల్‌ను లాక్కొని పారిపోయాడు. దీంతో మరిన్ని బలగాలు రంగంలోకి దిగి తక్షణమే కూంబింగ్ జరిపారు, ”అని సెంట్రల్ నోయిడా ADCP హిర్దేష్ కతేరియా తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో నిందితుడి కాలుకు గాయమైంది’ అని కతేరియా తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడి నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కతేరియా తెలిపారు. “నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు. డెలివరీపై గతంలో అనేక కేసులున్నాయి.
Related News
Ladies Hostel: షాకింగ్.. లేడీస్ హాస్టల్ లో మహిళ స్నానం.. రహస్యంగా ఫోన్ లో చిత్రీకరణ
Ladies Hostel: ఉద్యోగం, చదువు, ఇతర అవసరాల కోసం ఎంతోమంది మహిళలు, అమ్మాయిలు హైదరాబాద్ కు వస్తుంటారు. అయితే వారంతా ఎక్కువగా హాస్టల్ లో ఉంటూ చదువుకోవడమో, జాబ్ చేయడమో చేస్తుంటారు. హాస్టళ్లలో ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. అమ్మాయిలకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా వెంగళరావునగర్ లోని ఓ హాస్టల్ లో ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తులపై మధురానగర్ పోలీసులు కే