Sabarmati Express : పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏమైందంటే ?
శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
- By Pasha Published Date - 07:17 AM, Sat - 17 August 24

Sabarmati Express : శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాన్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని 20 బోగీలు పట్టాలు తప్పాయి. యూపీలోని ఝాన్సీ నగరం వైపుగా ట్రైను వెళ్తుండగా కాన్పూర్ – భీమ్‌సేన్ స్టేషన్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే లక్కీగా ఎవరికీ గాయాలు కాలేదు. కానీ రైలు ప్రమాదం వల్ల ఈ మార్గంలోని రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.
We’re now on WhatsApp. Click to Join
ఈ ప్రమాదం వివరాలను నార్త్ సెంట్రల్ రైల్వే అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 19168 నంబరు కలిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ ‘వారణాసి జంక్షన్ – అహ్మదాబాద్’ రూట్‌లో రాకపోకలు సాగిస్తుంటుందని, ఆ రైలే ఇప్పుడు ప్రమాదానికి గురైందని వెల్లడించారు. పట్టాలపై ఎవరో పెట్టిన రాళ్లను రైలు ఇంజిన్ తాకిన వెంటనే.. సబర్మతి ఎక్స్‌ప్రెస్(Sabarmati Express) పట్టాలు తప్పిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఎవరికీ గాయాలు కాకపోవడంతో తాము ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు.
Also Read :Raksha Bandhan: రక్షాబంధన్ రోజు ఈ మంత్రం పఠిస్తూ రాఖీ కట్టండి..!
ఈ నేపథ్యంలో హుటాహుటిన ప్రమాద స్థలి వద్ద పెద్దసంఖ్యలో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలను పంపించారు. రెస్క్యూ టీమ్‌లను రంగంలోకి దింపారు. రైలులోని ప్రయాణికులను సమీపంలోని రైల్వే స్టేషను వరకు చేర్చేందుకు సంఘటనా స్థలానికి ఒక బస్సును రైల్వేశాఖ పంపింది. ఆ రైల్వే స్టేషను నుంచి వారిని ప్రత్యేక ట్రైనులో గమ్యస్థానాల్లో దింపనున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో సంబంధిత స్టేషన్‌లకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్ : 0532-2408128, 0532-2407353, 0532-2408149; కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్: 0512-2323018, 0512-2323016, 0512-23230152; మీర్జాపూర్ రైల్వే స్టేషన్: 0544-22200973; ఫతేపూర్ రైల్వే స్టేషన్: 73929646224; నైని జంక్షన్ రైల్వే స్టేషన్: 0532-26972525; చునార్ జంక్షన్ రైల్వే: 88403778936; ఇటావా జంక్షన్ రైల్వే స్టేషన్: 75250012497; హత్రాస్ జంక్షన్ రైల్వే స్టేషన్: 75250013368; ఫాఫుండ్ రైల్వే స్టేషన్: 7505720185.