Delhi CM: విపాసన సెషన్ కు ఢిల్లీ సీఎం క్రేజీవాల్
- Author : Balu J
Date : 16-12-2023 - 3:33 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi CM: రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు రోజువారి జీవితం నుంచి రిలాక్స్ అయ్యేందుకు వివిధ స్థలాలు, టూరిస్టు ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం రిచార్జ్ అయ్యేందుకు పురాతన పద్దతులను అవలంబిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన డిసెంబర్ 19 నుండి 30 వరకు 10 రోజుల విపాసన సెషన్‌లో పాల్గొంటారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం తెలిపింది.
డిసెంబరు 19న సెషన్‌కు వెళ్లి డిసెంబర్ 30న తిరిగి వస్తారని పార్టీ తెలిపింది. కేజ్రీవాల్ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు విపాసన చేస్తున్నారు. అయితే, డిసెంబర్ 19న ఇక్కడి అశోక్ హోటల్‌లో జరగనున్న ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ బ్లాక్ సమావేశానికి ఆయన హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Also Read: Bikini Beauty: బికినీ అందాలతో సెగలు రేపుతున్న అరియానా, సెక్సీ ఫోజులతో గ్లామర్ ట్రీట్