Rescue Ops: ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు…ఆదివారం ఢిల్లీ చేరుకోనున్న రొమేనియా ఫ్లైట్..!!!
ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మూడోరోజు కూడా విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్ పై బాంబులు మిస్సైల్స్ తో రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి.
- By Hashtag U Published Date - 12:59 AM, Sun - 27 February 22

ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం మూడోరోజు కూడా విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్ పై బాంబులు మిస్సైల్స్ తో రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ప్రమాదక ప్రదేశాల్లో ఉన్న వారంతా బాంబ్ షెల్టర్స్, అండర్ గ్రౌండ్స్ , మెట్రో స్టేషన్లు, బంకర్లలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు.
ఈనేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తమ దేశీయ పౌరులను సురక్షితంగా తమ దేశానికి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేపట్టాయి. భారత్ కూడా ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చుందుకు కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇండియన్ ఎంబీసీతో కలిసి భారతపౌరులను, విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రారంభమైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో 219మంది భారతీయలు శనివారం రాత్రి 8గంటల సమయంలో ముంబై లో ల్యాండ్ అయ్యింది. భారతీయులు తరలింపును మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక భారత విదేశాంగ బ్రుందాలు…24గంటలూ క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి.
ఫిబ్రవరి 27, ఆదివారం తెల్లవారుజామున 2.30గంటలకు మరో ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకోనుంది. ఒక్కో విమానంలో 235 నుంచి 240మంది విద్యార్థులు వచ్చే ఛాన్స్ ఉంది. విద్యార్థులంతా బుకారెస్టు ఎయిర్ పోర్టు చేరుకోవడం ఆలస్యం అవుతోంది. దీనికారణంగానే ముంబై, ఢిల్లీ నుంచి విమానాలు ఆలస్యంగా వెళ్లాయని విమానాయన వర్గాలు తెలిపాయి.
2nd evacuation flight from Romania to India leaves the country. It is carrying 250 Indian nationals who crossed over from Ukraine amid the Russian invasion. The flight will land in Delhi tomm morning. pic.twitter.com/Q39D7rZz7d
— Sidhant Sibal (@sidhant) February 26, 2022