HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Covaxin Gets Emergency Use Approval For Kids

పిల్లలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వ్యాక్సిన్

కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

  • Author : Balu J Date : 12-10-2021 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఏంచేయాలో తెలియక మొబైల్స్ గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేశారు. అయితే కొవిడ్ పిల్లలకు సోకినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పాలి. పిల్లలకు సైతం టీకా వేయాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకున్నప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ అందించింది.

కరోనా కట్టడి కోసం భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్‌ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్‌ బయోటెక్‌. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్‌ ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీకి అనుమతులిచ్చాం” అని ఒక ప్రకటనలో తెలిపింది. తర్వలోనే పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల పెద్దలు, సీనియర్ సిటిజన్స్ చనిపోయినప్పటికీ, పిల్లలపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా 0-5 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఇమ్యూనిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ల అభిప్రాయం. సెకండ్ వేవ్ లో కరోనా ప్రభావం కూడా పిల్లలపై అంతంతమాత్రమే. త్వరలోనే టీకా వస్తుండటంతో ఇన్నాళ్లు ఇళ్లకు పరిమితమైన చిన్నారులు స్వేచ్ఛగా బయట అడుగుపెట్టనున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • children
  • india
  • kids vaccine
  • vaccine

Related News

New Currency

New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్‌బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్‌బీఐ దృ

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd