Constitution Day 2024 : రాజ్యాంగ రచన టీమ్‌లో హైదరాబాద్, రాజమండ్రి నారీమణులు.. ఎవరో తెలుసా?
వారందరూ కలిసి దేశంలోని మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్లు సహా అన్ని వర్గాల వారి వికాసానికి దోహదపడేలా రాజ్యాంగ రూపకల్పనకు(Constitution Day 2024) బాటలు చూపారు.
- By Pasha Published Date - 10:31 AM, Tue - 26 November 24

Constitution Day 2024 : ఇవాళ (నవంబరు 26) భారత రాజ్యాంగ దినోత్సవం. మన దేశ రాజ్యాంగం 1949లో సరిగ్గా ఇదే నెలలో ఇదే తేదీన అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందు జరిగిన భారత రాజ్యాంగ రచనకు సంబంధించిన ప్రాసెస్ చాలా పెద్దది. చాలా క్లిష్టమైనది. రాజ్యాంగ రచన టీమ్‌లో 15 మంది నారీమణులు ఉన్నారు. వీరిలో దళిత వర్గానికి చెందిన ఒక మహిళ కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన సరోజినీ నాయుడు, రాజమండ్రిలో జన్మించిన దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ సైతం రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్రను పోషించడం విశేషం. వారందరూ కలిసి దేశంలోని మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్లు సహా అన్ని వర్గాల వారి వికాసానికి దోహదపడేలా రాజ్యాంగ రూపకల్పనకు(Constitution Day 2024) బాటలు చూపారు. రాజ్యాంగ దినోత్సవం వేళ దేశ గర్వించే ఆ నారీమణుల గురించి తెలుసుకుందాం..
Also Read :Rajiv Swagruha : రాజీవ్ స్వగృహ ఇళ్లు, భూముల వేలంపాటకు రంగం సిద్ధం
- దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ మన రాజమండ్రిలో జన్మించారు. ఆమెకు చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. టంగుటూరి ప్రకాశం పంతులుతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1936లో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రణాళికా సంఘంలో సభ్యురాలిగా దుర్గాభాయ్ పనిచేశారు.
- సరోజినీ నాయుడు మన హైదరాబాద్‌లో జన్మించారు. గాంధీజీకి అత్యంత సన్నిహితుల్లో ఈమె కూడా ఒకరు. 1931లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం రెండో సెషన్‌కు గాంధీతో కలిసి సరోజినీ హాజరయ్యారు.
- సుచేతా కృపాలినీ హర్యానాలో జన్మించారు. ఆమె 1940లో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగాన్ని స్థాపించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1963లో సుచేత ఉత్తరప్రదేశ్ సీఎం అయ్యారు. మన దేశంలో తొలి మహిళా సీఎంగా రికార్డును సొంతం చేసుకున్నారు.
- విజయలక్ష్మి పండిట్.. ఈమె మన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సోదరి. భారత రాజ్యాంగాన్ని రూపొందించాలని రాజ్యాంగ సభకు పిలుపునిచ్చిన తొలి నాయకురాలుగా ఆమె ఘనతను సొంతం చేసుకున్నారు.
- బేగం ఐజాజ్ రసుల్.. భారత రాజ్యాంగ పరిషత్‌లోని ఏకైక ముస్లిం సభ్యురాలు. ఆమె మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. ఇలాంటి చర్యలు మెజారిటీ నుంచి మైనారిటీలను శాశ్వతంగా విభజిస్తాయని ఆమె నమ్మారు.
- దాక్షాయణి వేెలాయుధన్.. 1946లో భారత రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన ఏకైక దళిత మహిళ. ఈమె కేరళలోని కొచ్చిన్‌లో జన్మించారు. కొచ్చిన్, ట్రావెన్స్‌కోర్‌లోని అగ్రవర్ణ వర్గాల నుంచి వేెలాయుధన్ వివక్షను ఎదుర్కొన్నారు. అంటరానితనాన్ని నిర్మూలించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 17కు ఈమె మద్దతు ఇచ్చారు.
- కమలా చౌదరి.. లక్నో వాస్తవ్యురాలు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 54వ సెషన్‌కు ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. మహిళలను ఏకం చేయడానికి చరఖా కమిటీలను ఈమె ఏర్పాటు చేశారు.
- అన్నీ మస్కరీన్.. లాటిన్ కాథలిక్ కుటుంబంలో జన్మించారు. ఈమె కేరళలోని తిరువనంతపురం వాస్తవ్యురాలు. ట్రావెన్‌కోర్‌లో మంత్రిగా శాసనసభలో స్థానం పొందిన తొలి మహిళగా ఈమె రికార్డు క్రియేట్ చేశారు.