HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Cm Chandrababu Election Campaign In Delhi

Delhi Elections : రాజధానిలో బాబు ప్రచారం..బిజెపి నయా ప్లాన్

Delhi Elections : ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ లో బిజెపి నేతల తరుపున ప్రచారం చేయబోతున్నారు

  • Author : Sudheer Date : 29-01-2025 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu Election Cam
Cm Chandrababu Election Cam

దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) వేడి రోజు రోజుకు కాకరేపుతుంది. అధికార , ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా తమ మ్యానిఫెస్టో లను విడుదల చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) ఢిల్లీ లో బిజెపి నేతల తరుపున ప్రచారం చేయబోతున్నారు.

Indian News Paper Day : జనవరి 29ని ఇండియన్ న్యూస్ పేపర్ డేగా ఎందుకు జరుపుకుంటారు..?

2024 సార్వత్రిక ఎన్నికలలో ఇటు ఏపీతో అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ ఏర్పాటులో కూడా కూటమి తరఫున గెలుపొందిన ఎంపీలు కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మహాయుతి కూటమి గెలుపులో కీలకమైయ్యారు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన రాజకీయ నేత కావడంతో, ఆయన సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచేందుకు చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.

బీజేపీ ప్రధానంగా ఆప్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఓడించాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారం మరింత ప్రభావశీలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తెలుగు ప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం చేస్తారని వార్తలైతే బయటకు వస్తున్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Delhi elections
  • Election Campaign In Delhi

Related News

Manoj Babu

Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

పిల్లల ఎదుగుదలలో అత్యంత కీలకమైన దశలో వారిని అనవసరమైన సామాజిక ఒత్తిళ్ల నుండి కాపాడటం సమాజం యొక్క ఉమ్మడి బాధ్యత అని మంచు మనోజ్ తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలు ఆటపాటలకు దూరమై

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd