UPSC 2024 : సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
దేశంలోని ప్రధాన కేంద్రాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
- By Latha Suma Published Date - 08:38 PM, Fri - 9 August 24

UPSC 2024: సివిల్స్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా యూపీఎస్సీ సివిల్స్ ప్రధాన పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు యూపీఎస్సీ ఒక అధికారిక ప్రకటనను కూడా జారీ చేసింది. దేశంలోని ప్రధాన కేంద్రాల్లో సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హుత వహిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
దేశవ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటి ఫలితాలను జులై 1న విడుదల చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరిగాయి. మొదటి సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించారు. ఇక, సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా యూపీఎస్సీ త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది.
సివిల్స్ ప్రధాన పరీక్ష తేదీలివే..
.పరీక్ష తేదీ ఉదయం మధ్యాహ్నం
.20.09.2024 పేపర్-1 ఎస్సే
.21.09.2024 పేపర్-2 జనరల్ స్టడీస్-1 పేపర్-3 జనరల్ స్టడీస్-2
.22.09.2024 పేపర్-4 జనరల్ స్టడీస్-3 పేపర్-5 జనరల్ స్టడీస్-4
.28.09.2024 పేపర్-ఎ (ఇండియన్ లాంగ్వేజ్) పేపర్-బి (ఇంగ్లిష్)
.29.09.2024 పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1) పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్-2)
Read Also: Kodangal Lands Issue : కేటీఆర్ వద్దకు రేవంత్ పంచాయితీ