Chhattisgarh CM Offer: చత్తీస్ గఢ్ సీఎం బంపర్ ఆఫర్…పది మంది టాపర్లకు హెలికాప్టర్ ప్రయాణం.!!
విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తే...వారికి నగదు లేదా ల్యాప్ టాప్, ట్యాబ్ ఇలా బహుమతులు ఇస్తుంటారు.
- By Hashtag U Published Date - 10:04 AM, Fri - 6 May 22

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తే…వారికి నగదు లేదా ల్యాప్ టాప్, ట్యాబ్ ఇలా బహుమతులు ఇస్తుంటారు. కానీ చత్తీస్ ఘఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు. విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10,12 తరగతుల పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన పది మంది విద్యార్థులను హెలికాప్టర్ లో ఎక్కిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను హెలికాప్టర్ లో ప్రయాణించే అవకాశం కల్పిస్తాననన్నారు.
అయితే పిల్లలకు ఈ హెలికాప్టర్ ప్రయాణం ఓ స్పూర్తిగా నిలుస్తుందని…జీవితంలోనూ ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలన్నా వారి ఆశయానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత టాప్ పది మందివిద్యార్థులను హెలికాప్టర్ ప్రయాణం కోసం రాయ్ పూర్ కు ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పర్యటనలు సాగిస్తున్న నేపథ్యంలో సీఎం బలరాంపూర్ జిల్లా రాజ్ పూర్ లో ఈ ప్రకటన చేశారు.