HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Challenges Awaits For Kharghe As Cong Prez

Kharge: కాంగ్రెస్‌ను ఖర్గే గాడిన పెడతారా ?

1998లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు సోనియా గాంధీ.

  • Author : Naresh Kumar Date : 27-10-2022 - 6:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallikarjun Kharge Imresizer
Mallikarjun Kharge Imresizer

1998లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు సోనియా గాంధీ. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత అంతకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పార్టీ పగ్గాలు అందుకున్నారు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. మరి కొత్త అధ్యక్షుడి రాకతోనైనా పార్టీ హస్తవాసి మారేనా..? ఖర్గే ముందున్న సవాళ్లేంటి..?
గాంధీల సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు మల్లికార్జున ఖర్గే. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బ్యాటన్ అందుకున్నారు. 24 ఏళ్ల తర్వాత ఏఐసీసీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నూతన అధ్యక్షుడు ఖర్గేకు అభినందనలు తెలియజేశారు సోనియా, రాహుల్ గాంధీ.ఓ కార్మికుడి బిడ్డ కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం మరిచిపోలేని అనుభూతి అన్నారు ఖర్గే. సోనియా గాంధీకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి అన్నివిధాలా కృషి చేస్తానన్న ఖర్గే.. నేతలు కార్యకర్తలు పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు రావడం తనకు పెద్ద రిలీఫ్‌ అన్నారు సోనియా గాంధీ. ఖర్గే అనుభవం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని.. శ్రేణులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.కాంగ్రెస్ నూతన సారథి మల్లికార్జున ఖర్గే ముందు అనేక సవాళ్లున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు తొలి పరీక్ష. రెండుచోట్లా కాంగ్రెస్‌కు పెద్దగా విజయావకాశాలు లేవు. ఇక రాజస్థాన్, కర్ణాటకల్లో అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లే నేర్పు ఖర్గేలో ఉన్నా.. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాల్లో ఐక్యత సాధించడం మాత్రం పెద్ద సవాలే. 2023లో సొంత రాష్ట్రం కర్ణాటక సహా 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించే బాధ్యత ఖర్గేపైనే పడనుంది. ఇవన్నీ ఒక ఎత్తు. కాగా.. ఖర్గేని రిమోట్‌తో నియంత్రించేది గాంధీ కుటుంబమేనంటూ వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా పనిచేయడం మరో ఎత్తు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • congress president
  • mallikarjun kharge

Related News

T Congress

Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షీన‌ట‌రాజ‌న్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపే

  • Dk Shiva Kumar

    Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • Siddaramaiah

    Congress : క‌ర్ణాట‌క రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం. డిప్యూటీ సీఎం ప‌ద‌వి త‌న కుమారుడికి ఇవ్వాలంటున్న సిద్ధా

  • siddaramaiah-and-dk-shivakumar

    Karnataka : వీడ్కోలు సమావేశంలో భావోద్వేగ క్షణాలు.. డీకేకు ఆశీర్వాదం ఇచ్చిన సిద్దరామయ్య

Latest News

  • Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

  • Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

  • Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

  • US : అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్టు.. దేశ బహిష్కరణకు సిద్ధం

  • LPG Price Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd