Corona : కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం
Corona : కేవలం గత 24 గంటల్లోనే ఆరుగురు మృతి చెందడం, 2025లో ఇప్పటివరకు మొత్తం 55 మంది కరోనా వల్ల మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది
- By Sudheer Published Date - 11:05 AM, Thu - 12 June 25

దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ విజృంభిస్తోంది. జూన్ 12 నాటికి భారత్‌లో మొత్తం 7,121 యాక్టివ్ కేసులు నమోదు కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేవలం గత 24 గంటల్లోనే ఆరుగురు మృతి చెందడం, 2025లో ఇప్పటివరకు మొత్తం 55 మంది కరోనా వల్ల మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసుపత్రులు కోవిడ్ వార్డులను మళ్లీ తెరిచారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని మోదీని కలిసే అధికారులకు RT-PCR టెస్ట్ తప్పనిసరి చేయడంతో పరిస్థితి పట్ల ప్రభుత్వం సీరియస్‌గా ఉందని స్పష్టమవుతోంది.
Kutami Govt : కూటమి సర్కార్ కు ఏడాది..ప్లస్ లు, మైనస్ లు ఇవే…!!
ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్లు — XBB.1.16, ఎరిస్ (EG.5), JN.1 లాంటి సబ్‌వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వీటిలో మొదటిగా XBB.1.16ని మార్చి 2023లో గుర్తించగా, ఎరిస్‌ను ఆగస్టులో, JN.1ని డిసెంబర్‌లో కేరళలో గుర్తించారు. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ తీవ్రత తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తోంది. అయినప్పటికీ నిపుణులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, వ్యాక్సినేషన్ పూర్తిచేయడం లాంటివి ప్రాథమిక చర్యలుగా సూచిస్తున్నారు.
Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో అత్యధిక కేసులు నమోదు చేసిన దేశంగా నిలిచింది. యూరప్, ఆసియాలోని కొన్ని దేశాల్లో కొత్త వేరియంట్ల ప్రభావంతో లాక్‌డౌన్‌లు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ వ్యూహాలపై దృష్టి పెట్టడంతోపాటు, ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ప్రజల సహకారంతోనే ఈ మళ్లీ విస్తరిస్తున్న వైరస్‌ను నియంత్రించగలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.