CBI : IRS ఇంట్లో రూ.కోటి నగదు, 3.5 కేజీల గోల్డ్
CBI : అమిత్ సింఘాల్‌కు ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లలో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత దర్యాప్తులో అవి ఎలా సంపాదించబడ్డాయన్న అంశం ప్రధానంగా దర్యాప్తు
- By Sudheer Published Date - 07:36 AM, Tue - 3 June 25

లంచం తీసుకున్న కేసులో అరెస్టయిన IRS అధికారి అమిత్ కుమార్ సింఘాల్ (IRS officer Amit Kumar Singal) ఇంట్లో సీబీఐ అధికారులు చేసిన సోదాల్లో (CBI slices ) సంచలన వివరాలు బయటపడ్డాయి. ఢిల్లీలోని ఆయన నివాసంలో దాడి చేసిన అధికారులు రూ.1 కోటి నగదు, 3.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 25 బ్యాంక్ లాకర్లలో దాచిన పలు కీలక డాక్యుమెంట్లు కూడా సీజ్ చేసినట్లు సమాచారం.
Karachi Jail : కరాచీ జైలు నుంచి ఖైదీలు పరారీ!
అమిత్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్పేయర్స్ విభాగంలో డైరెక్టర్ జనరల్ (DG)గా ఉన్నారు. ఓ పన్ను చెల్లింపుదారుడికి ట్యాక్స్ మినహాయింపు కల్పించేందుకు రూ.25 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సీబీఐకి చిక్కారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆస్తులపై కూడా అధికారులు తనిఖీలు ప్రారంభించారు.
IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమిత్ సింఘాల్‌కు ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లలో పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుత దర్యాప్తులో అవి ఎలా సంపాదించబడ్డాయన్న అంశం ప్రధానంగా దర్యాప్తు పరిధిలోకి వచ్చింది. కేంద్రం తీసుకొన్న యాంటీ-కరప్షన్ చర్యల్లో భాగంగా ఈ కేసు బలమైన ఉదాహరణగా నిలుస్తోంది.