Google Map : ప్రాణాల మీదకు తెచ్చిన గూగుల్ మ్యాప్
Google Map : గోరఖ్‌పూర్ (Gorakhpur ) నుంచి సోనౌలీ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న లక్నో రిజిస్ట్రేషన్ కారులో ఉన్నవారు, గూగుల్ మ్యాప్స్ సూచించిన మార్గాన్ని గుడ్డిగా అనుసరించడంతో ప్రమాదానికి గురయ్యారు
- Author : Sudheer
Date : 11-06-2025 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరప్రదేశ్‌లో గూగుల్ మ్యాప్స్ (Google Map) చూపించిన దారిని అనుసరించిన ఒక కారు అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడిన (Car Falls off Under-Construction) సంఘటన కలకలం రేపుతోంది. మహారాజ్‌గంజ్ జిల్లా ఫరిండా పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 8న ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్ (Gorakhpur ) నుంచి సోనౌలీ సరిహద్దు వైపు ప్రయాణిస్తున్న లక్నో రిజిస్ట్రేషన్ కారులో ఉన్నవారు, గూగుల్ మ్యాప్స్ సూచించిన మార్గాన్ని గుడ్డిగా అనుసరించడంతో ప్రమాదానికి గురయ్యారు. ఫ్లైఓవర్ పూర్తిగా నిర్మించలేదు అనే విషయం తెలియక కారు నేరుగా దానిపైకి వెళ్లిపోయి, నిర్మాణం కొనసాగుతున్న చివరి భాగం వద్ద అదుపుతప్పి కిందపడింది. అదృష్టవశాత్తు బురద ఉన్న కారణంగా కారు పూర్తిగా కిందపడకపోవడంతో అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ప్రయాణికులను రక్షించారు. ప్రయాణదారులు గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మడం, రాత్రిపూట సరైన వెలుతురు లేకపోవడం, ఫ్లైఓవర్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “నిర్మాణంలో ఉన్న ప్రాంతాల్లో కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టకపోతే ఎలా?” అని ప్రశ్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “గూగుల్ మ్యాప్స్ ఎంత టెక్నాలజీ అయినా సరే, ప్రతి మార్గం భద్రతగా ఉండకపోవచ్చు” అంటూ కొందరు హెచ్చరిస్తుండగా, “హెచ్చరికల బోర్డులు లేకపోవడం అసలైన సమస్య” అంటూ మరికొందరు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శిస్తున్నారు.
In Maharajganj district, Uttar Pradesh, a car navigating with a map on a mobile device got stuck on an under-construction flyover where the road abruptly ended. Fortunately, the car did not fall.
pic.twitter.com/DROcBDYLFW— Ghar Ke Kalesh (@gharkekalesh) June 9, 2025