Qatar Navy Case: ఖతార్ నుండి నేవీ మాజీ అధికారులను వెనక్కి రప్పించండి
ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఎదుర్కొన్న వారు భారతీయ మాజీ నావికాదళ అధికారులు కావడం విశేషం. ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాలు
- By Praveen Aluthuru Published Date - 11:31 PM, Thu - 26 October 23

Qatar Navy Case: ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షను ఎదుర్కొన్న వారు భారతీయ మాజీ నావికాదళ అధికారులు కావడం విశేషం. ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న అభియోగాలు ఆ ఎనిమిది మందిపై ఖతార్ ప్రభుత్వం నేరం మోపింది. ఈ మేరకు వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.
ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ వెనక్కి తీసుకురావాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఖతార్‌లో చిక్కుకున్న మాజీ నావికాదళ అధికారుల సమస్యను ఆగస్టులో లేవనెత్తినట్లు ఒవైసీ గుర్తు చేశారు. ఇస్లామిక్ దేశాలు తనను ఎంతగా ప్రేమిస్తున్నాయని నరేంద్ర మోదీ గొప్పలు చెప్పుకున్నారు. ప్రధాని మోడీ మాజీ నావికాదళ అధికారులను తిరిగి తీసుకురావాలి. వారు మరణశిక్షను ఎదుర్కోవడం చాలా దురదృష్టకరమని ఒవైసి తెలిపారు. ఖతార్‌లో ఏడాది కాలంగా నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించబడింది.
Also Read: Jagan Apologie: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ క్షమాపణ చెప్పాలి