Indrayani River Collapse : ఇంద్రాయణి నదిపై వంతెన కుప్పకూలి ఆరుగురు మృతి
Indrayani River Collapse : ఈ ప్రమాదంలో ఇంకా 25 మంది గల్లంతయ్యారు అని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీస్, అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కలిసి గాలింపు చర్యలు ప్రారంభించాయి
- By Sudheer Published Date - 04:37 PM, Sun - 15 June 25

మహారాష్ట్రలోని పుణే జిల్లా కుండమల ప్రాంతంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంద్రాయణి నది(Indrayani River)పై నిర్మించబడిన ఓ పాత వంతెన అకస్మాత్తుగా కూలిపోవడం(Indrayani River collapse)తో పెద్ద సంఖ్యలో ప్రజలు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు అని అధికారులు ధృవీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వంతెన మీద ఆ సమయంలో పాదచారులతో పాటు కొంతమంది వాహనదారులు కూడా ఉన్నారు.
Eruvaka Pournami : పంచె కట్టుతో దుక్కి దున్నిన మంత్రి పొంగులేటి
ఈ ప్రమాదంలో ఇంకా 25 మంది గల్లంతయ్యారు అని తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీస్, అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు కలిసి గాలింపు చర్యలు ప్రారంభించాయి. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల గాలింపు చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అయితే సహాయక చర్యలు పాక్షికంగా పురోగతిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం ప్రత్యేక నౌకలు, డైవర్స్ సహాయంతో శోధన కొనసాగుతోంది.
వంతెన కూలిన ఘటనకు కారణంగా నిర్మాణంలో లోపమా? పాతదై పోవడం వల్ల కూలిందా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ తగిన నష్టపరిహారం ప్రకటించే అవకాశముంది.
….पुणे जिले में इंद्रायणी नदी पर बना पुल का आधा हिस्सा गिरा।
जब ब्रिज गिरा तब मौके पर कई लोग ब्रिज पर मौजूद थे, बचाओ कार्य कुछ लोगो की मौत भी हुई है. pic.twitter.com/SiMmtH00cC
— Tariq Khan (@tariqkhansahara) June 15, 2025