Bomb Scare : భారత గగనతలంలో విమానానికి బాంబు భయం
ఇరాన్‌లోని టెహ్రాన్ నుండి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానం కు బాంబ్ బెదిరింపు వచ్చింది.
- By CS Rao Published Date - 03:13 PM, Mon - 3 October 22

ఇరాన్‌లోని టెహ్రాన్ నుండి చైనాలోని గ్వాంగ్‌జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానం కు బాంబ్ బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో భారత గగనతలంలో విమానం ఉంది. వెంటనే అప్రమత్తమైన భారత వైమానికి దళం ఆ విమానం అత్యవసరంగా జైపూర్ లేదా చండీఘడ్ లో దిగడానికి అనుమతి ఇచ్చింది. కానీ, ఆ విమానం పైలెట్ రెండు చోట్లా దిగకుండా చైనా వైపు విమానాన్ని తీసుకెళ్లాడు. యుద్ధ విమానాలు సురక్షిత దూరంలో ఆ విమానాన్ని అనురించాయని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ చూపించింది. ఉదయం 9:20 గంటలకు విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశారు. బాంబు భయం లేదని టెహ్రాన్ సంకేతాలు ఇచ్చిన తరువాత విమానం చైనాలోని తన గమ్యస్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగించిందని తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (MoCA) మరియు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సంయుక్తంగా నిర్దేశించిన విధానం ప్రకారం IAF అన్ని చర్యలను చేపట్టింది. ఈ విమానం భారత గగనతలం అంతటా వైమానిక దళంచే నిశితంగా రాడార్ నిఘాలో ఉంది.