Blast In Punjab Police HQ: పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంపై గ్రెనేట్ దాడి..!!
మొహాలీలో పేలుడు సంభవించింది. పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద ఈ పేలుడు జరిగినట్లు గుర్తించారు.
- By Hashtag U Published Date - 12:47 AM, Tue - 10 May 22

మొహాలీలో పేలుడు సంభవించింది. పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద ఈ పేలుడు జరిగినట్లు గుర్తించారు. భవనం లోపం గ్రనేడ్ పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. రాకెట్ తో నడిచే గ్రనేడ్ భవనంలోని మూడో అంతస్తులో పడినట్లు చెబుతున్నారు. పేలుడు ధాటికి కిటికీలు, డోర్లు ధ్వంసమయ్యాయి. రాకెట్ లాంచర్ ఉపయోగించి దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు ఉన్నతాధికారి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఈ ఘటనపై సీఎం భగవంత్ మాన్ పోలీసుల నుంచి పూర్తి నివేదికను కోరారు. పంజాబ్ పోలీసులు రాష్ట్రంలోని తరణ్ జిల్లాలోని ఒక గ్రామంలో ఉగ్రవాద దాడులను అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.