Madhya Pradesh Assembly Elections : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత
మధ్య ప్రదేశ్ లో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరిగాయి. భింద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నేతలు రాళ్ళు రువ్వుకున్నారు
- Author : Sudheer
Date : 17-11-2023 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Madhya Pradesh Assembly Elections) లో ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) ఎన్నికల పోలింగ్ నడుస్తుంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 2,534 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఛత్తీస్ ఘడ్ లో 38.22 శాతం, మధ్య ప్రదేశ్ లో 45.40 శాతం పోలింగ్ నమోదయింది. బాలాఘాట్, మండల, దిండోరి జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరిగింది. మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా మధ్య ప్రదేశ్ లో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరిగాయి. భింద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నేతలు రాళ్ళు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నేత రాకేశ్ శుకా ( BJP Candidate Rakesh Shuka sustained Injuries ) గాయపడ్డారు. ఆయన కార్ అద్దాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్(Kamalnath) చింద్వారాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. “ప్రజలు సత్యం వైపు నిలుస్తారని నాకు నమ్మకం ఉంది. నేను ప్రజలను విశ్వసిస్తాను. మెజారిటీ మార్క్ కంటే ఎక్కువ ఓట్లు సీట్లే కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది. బీజేపీకి పోలీసులు, డబ్బు, అధికారం ఉంది. అవి మరికొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. నిన్న నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. బీజేపీ నేతలు మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు చూపించే వీడియోను గుర్తు తెలియని వ్యక్తులు నాకు పంపారు” అని చెప్పుకొచ్చారు.
Read Also :