Bihar Minister: బిహార్‌లో సర్ప్రైజ్ మంత్రి దీపక్ ప్రకాశ్
దీపక్ ప్రకాశ్ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha), ఎమ్మెల్యే స్నేహలత కుష్వాహ (Snehlata Kushwaha)ల కుమారుడు.
- By Dinesh Akula Published Date - 08:56 PM, Fri - 21 November 25
పాట్నా: పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ (Election Contest) చేయకుండానే టెకీ (Techie – IT Professional) దీపక్ ప్రకాశ్ (Deepak Prakash) ఏకంగా మంత్రిగా (Minister) ప్రమాణం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్డీయే కూటమి విజయం తర్వాత జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన సాధారణ డ్రెస్ (Casual Outfit)తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ఇతర నేతలు సంప్రదాయ దుస్తులతో వచ్చేసరికి, దీపక్ మాత్రం షర్ట్–జీన్స్‌లోనే వేదికపైకి వచ్చి ప్రధాని మోదీతో పలకరించారు.
Deepak Prakash became a minister in one of India’s poorest states without even contesting an election. Not because he’s poor, but because his father literally owns the party and his mother is an MLA. What exactly will he deliver for Bihar? #BiharPolitics
pic.twitter.com/FuhwjVnQYF— Civic Opposition of India (@CivicOp_india) November 20, 2025
దీపక్ ప్రకాశ్ రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ (Upendra Kushwaha), ఎమ్మెల్యే స్నేహలత కుష్వాహ (Snehlata Kushwaha)ల కుమారుడు. తల్లి సాసారం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా, 36 ఏళ్ల దీపక్ మాత్రం ఎలాంటి ఎన్నికల పోటీ లేకుండానే మంత్రి పదవి దక్కించుకున్నారు. మణిపాల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంతో ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఈసారి బిహార్ ఎన్నికల్లో ఆర్ఎల్ఎమ్ ఆరు స్థానాల్లో పోటీ చేసి నాలుగు చోట్ల గెలిచింది. దీంతో నితీశ్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి స్థానాన్ని సాధించింది. ఆ పదవి తల్లికే దక్కుతుందని భావించినప్పటికీ, చివరి నిమిషంలో ఉపేంద్ర కుష్వాహ తనయుడి పేరు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచారు.
మంత్రి పదవి రావడంపై స్పందించిన దీపక్, చిన్నప్పటి నుంచే రాజకీయాలు తనకు కొత్త కాదని, గత ఐదేళ్లుగా పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నానన్నారు. ప్రమాణస్వీకార వేళ సాధారణ దుస్తులు ధరించడం గురించి ప్రశ్నించగా, “రాజకీయాలు ప్రజలకు దగ్గరగా ఉండాలి. నేను సౌకర్యవంతమైన దుస్తులే వేసుకున్నాను. మరో ఐదేళ్లూ ఇదే స్టైల్లో ఉంటాను. తర్వాత కుర్తా-పైజామాకు మారుతానో లేదో కాలమే చెబుతుంది’’ అని అన్నారు.
పోటీ లేకుండా మంత్రిగా కొనసాగడం సాధ్యమే కానీ, ఆరు నెలల్లోగా శాసనసభకు ఎన్నిక కావాలి లేదా మండలికి నామినేట్ అవ్వాలి. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి రాజకీయ అడుగులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.