Biggest Drug Bust: ఢిల్లీలో 2,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ స్వాధీనం
Biggest Drug Bust: ఢిల్లీలో అతిపెద్ద మాదక ద్రవ్యాల ముఠాను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. 2000 కోట్ల రూపాయల విలువైన 560 కిలోల కొకైన్ ను గుర్తించిన ఢిల్లీ పోలీసులు, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 02-10-2024 - 3:24 IST
Published By : Hashtagu Telugu Desk
Biggest Drug Bust: దేశంలో డ్రగ్స్ దందా అంతకంతకు పెరుగుతుంది. బడా బాబుల సమక్షంలో జరుగుతున్న ఈ డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ ను నిర్ములించడం కష్టతరంగా మారుతుంది. అయితే భారీ డ్రగ్స్ పట్టు పడుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఢిల్లీలో భారీ మొత్తంలో కొకైన్ వెలుగు చూసింది. ఢిల్లీ పోలీసులు చాకచక్యంగా డ్రగ్స్ రాయుళ్లను పట్టుకుని విచారిస్తున్నారు.
ఢిల్లీ పోలీసులు బుధవారం అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌ను ఛేదించారు. రూ. 2,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ భారీ డ్రగ్స్ వ్యవహారాన్ని ఛేదించింది. స్వాధీనం చేసుకున్న కొకైన్ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ. 2,000 కోట్ల విలువైనదని పోలీసులు తెలిపారు. ఇంత భారీ మొత్తం పట్టుబడటంతో ఈ కేసును హై ప్రొఫైల్ గా తీసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నార్కో టెర్రర్ కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగానే ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Varahi Declaration Book: తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్ర బుక్, ఆ పుస్తకంలో ఏముంది?