Bigg Boss Scam: ‘బిగ్‌బాస్’లో అవకాశం ఇస్తానని 10 లక్షలు మోసం
Bigg Boss Scam: భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని మోసం చేశాడు.
- By Kavya Krishna Published Date - 11:11 AM, Tue - 5 August 25

Bigg Boss Scam: భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని మోసం చేశాడు. భోపాల్‌కు చెందిన డాక్టర్ అభినిత్ గుప్తా నుంచి ఏకంగా రూ.10 లక్షలు తీసుకొని గల్లంతైన ఈ సంఘటన వైద్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
Sravana Masam : శ్రావణ పుత్రదా ఏకాదశి రోజు ఏం చేయాలి?
భోపాల్‌లో ‘పాయిజన్ స్కిన్ క్లినిక్’ నిర్వహిస్తున్న డాక్టర్ అభినిత్ గుప్తాను 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి సంప్రదించాడు. తాను ఈవెంట్ డైరెక్టర్‌నని, టెలివిజన్ నిర్మాణ సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి విశ్వాసం కల్పించాడు. బిగ్‌బాస్‌లో డాక్టర్‌కు ప్రవేశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. కరణ్ మాటలు నమ్మిన డాక్టర్ గుప్తా రూ.10 లక్షలు చెల్లించారు.
తరువాతి కాలంలో బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా విడుదలయ్యింది. ఆ జాబితాలో డాక్టర్ గుప్తా పేరు లేకపోవడంతో ఆయన కరణ్ సింగ్‌ను ప్రశ్నించారు. దీనికి కరణ్ సింగ్ ‘బ్యాక్‌డోర్ పద్ధతి’ ద్వారా అవకాశం వస్తుందని చెప్పి తప్పించుకున్నాడు.
అయితే రోజులు గడిచినా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో డాక్టర్ గుప్తా తన డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశారు. ఆ తర్వాతి నుంచి కరణ్ సింగ్ ఫోన్ కాల్స్ ఎత్తడం మానేశాడు. చివరికి ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు.
తన డబ్బులు తిరిగి రాకపోవడంతో డాక్టర్ అభినిత్ గుప్తా పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోసగాడి కోసం దర్యాప్తు ప్రారంభించారు.
Indiramma Housing Scheme : నిన్న ఒక్క రోజే రూ. 130 కోట్లను బదిలీ చేసిన సర్కార్