Doctor Rape-Murder Case: కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం, ఆస్పత్రి క్లోజ్
నిరసన కారులు ఆర్‌జి కర్ హాస్పిటల్ సమీపంలోని పోలీసు బారికేడ్‌ను బద్దలు కొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది
- By Praveen Aluthuru Published Date - 12:45 PM, Fri - 16 August 24

Doctor Rape-Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించి అత్యవసర విభాగాన్ని ధ్వంసం చేశారు. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కలకత్తా హైకోర్టు ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అభివర్ణించింది. అదే సమయంలో ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది. అదే సమయంలో ఆసుపత్రిలో ఉన్న రోగులను వేరే ఆసుపత్రికి తరలించాలని పేర్కొంది.
నిరసన కారులు ఆర్‌జి కర్ హాస్పిటల్ సమీపంలోని పోలీసు బారికేడ్‌ను బద్దలు కొట్టి ప్రాంగణంలోకి ప్రవేశించారు. కుర్చీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అత్యాచారం, మరియు హత్యకు గురైన జూనియర్ డాక్టర్‌కు న్యాయం చేయాలంటూ కోల్‌కతా వీధుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు నిరసనలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల ఎదుటే కూల్చివేతలు:
ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులు ఎవరో తెలియరాలేదు. పోలీసుల ఎదుటే విధ్వంసం కొనసాగడమే పెద్ద విషయం. మహిళలు శాంతియుతంగా సాగిపోతున్న ఉద్యమాల నుంచి దృష్టి మరల్చేందుకు ఇదొక ప్లాన్డ్ ఇన్సిడెంట్ కాదా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నిరసన వేదికను కూడా నిరసన కారులు ధ్వంసం చేశారు.
పలు ఆసుపత్రుల్లో వైద్యుల సమ్మె:
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ మహిళా రెసిడెంట్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం మరియు హత్య ఘటనకు నిరసనగా రెసిడెంట్ వైద్యుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. దీని కారణంగా శుక్రవారం ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్, ఆర్‌ఎంఎల్, లోక్‌నాయక్, జిబి పంత్‌తో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపిడి, రెగ్యులర్ సర్జరీ మరియు అత్యవసరం మినహా అన్ని ఇతర వైద్య సదుపాయాలు ప్రభావితం అవుతున్నాయి.
Also Read: Monkeypox: మంకీపాక్స్ కలకలం.. టెన్షన్ పడుతున్న భారత్..!