HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Bandi Sanjay About Delhi Election Results

Delhi Election Results : ఓటర్లు ‘AAP’ ని చీపురుతో ఊడ్చేశారు – బండి సంజయ్

Delhi Election Results : ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. "ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారు" అని అన్నారు

  • Author : Sudheer Date : 08-02-2025 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi Delhi
Bandi Delhi

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Election Results) బీజేపీ(BJP)కి అనుకూలంగా మారడంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్ అయిన 36ను బిజెపి దాటేసి పూర్తి మెజారిటీ దిశగా సాగుతోంది. అటు ఆప్ పార్టీ 28 స్థానాల్లో పోటీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సంబరాలు మొదలుపెట్టారు. ఈ ఫలితాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. “ఢిల్లీ ప్రజలు ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారు” అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పుడు వాగ్దానాలను, అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మలేదని స్పష్టం చేశారు. మెజార్టీ వర్గం పూర్తిగా బీజేపీ వైపు మొగ్గుచూపిందని , కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రధాని, రాష్ట్రపతిని అవమానించడమే కాకుండా, ప్రజాస్వామ్య విధానాలను దెబ్బతీసేలా పాలన సాగించిందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిపాలన పునరుద్ధరించాలని ఆశించిన ఢిల్లీ ప్రజలు, బీజేపీకి అధికారం కట్టబెట్టారని పేర్కొన్నారు.

Key Leaders Result: ఆప్ అగ్రనేతల్లో ఆధిక్యంలో ఎవరు ? వెనుకంజలో ఎవరు ?

ఢిల్లీ విజయంతో బీజేపీ “డబుల్ ఇంజిన్ సర్కార్” ఏర్పాటు చేస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కలిసి మరింత అభివృద్ధిని తీసుకరాగలదని స్పష్టం చేశారు. తెలంగాణలో కూడా బీజేపీకి మెరుగైన భవిష్యత్తు ఉందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. “త్వరలో 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ విజయం తెలంగాణలో బీజేపీకి మరింత బలాన్నిస్తుందని ఆయన అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • Bandi Sanjay
  • bjp
  • Delhi Election Results 2025
  • Delhi elections

Related News

Bihar Bjp

BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

నితీశ్ కుమార్‌ను కేంద్రంలోకి తీసుకోవడం ద్వారా బీహార్ ప్రభుత్వ పగ్గాలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని బీజేపీ వ్యూహం రచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) ప్రధాన పాత్ర పోషిస్తుండగా,

    Latest News

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

    • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

    • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

    • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd