Amrit Bharat Express : పట్టాలెక్కేందుకు సిద్దమైన అమృత్ భారత్ రైలు..దీని ప్రత్యేకతలు తెలుసా..?
- By Sudheer Published Date - 10:25 AM, Wed - 27 December 23

అమృత్ భారత్‌లో భాగంగా పుష్-పుల్ టెక్నాలజీతో తయారైన అమృత్ భారత్ రైలు (Amrit Bharat Express ) పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వందే భారత్ (Vande Bharat Train) తరహాలోనే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తుంది. అయోధ్య వేదికగా ప్రధాని మోడీ.. డిసెంబర్ 30న ఈ ట్రైన్లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా రెండు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మరో 6 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని వీటితో పాటే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
అమృత్ భారత్ రైలు కు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. ఢిల్లీ స్టేషన్‌లో కోచ్‌లు, లోకోమోటివ్‌లను పరిశీలించారు. వైష్ణవ్ కొత్త రైలులో పొందుపరచబడిన భద్రతా ప్రయోజనాలు, ప్రయాణీకుల-కేంద్రీకృత లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ట్రైన్ ప్రత్యేకతలు (Amrit Bharat Express Features) చూస్తే..
పుష్-పుల్ టెక్నాలజీ రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. ఒకటి ముందు. మరొకటి వెనుక. ముందు ఇంజిన్ రైలును లాగుతున్నప్పుడు, వెనుక ఇంజిన్ ఏకకాలంలో దాన్ని నెట్టివేస్తుంది. దీంతో ఆ రైలు త్వరగా అత్యంత వేగాన్ని అందుకోవడానికి దోహదపడుతుంది. దీని ద్వారా ఎత్తైన వంతెనలు, భారీ మలుపులు ఇతర వేగ-నిరోధిత రూట్లలో గమ్యాన్ని తగ్గిస్తుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, జనరల్ కోచ్‌లతో కలిపి 22 కోచ్‌లు ఉంటాయి. ఇది నాన్-ఏసీ స్లీపర్ కమ్ అన్ రిజర్వ్‌డ్ క్లాస్ సర్వీస్ ప్రత్యేకంగా ఖర్చుతో రూపొందించబడింది.
ఈ ట్రైన్ కుంకుమ-బూడిద రంగు లో రూపొందించారు. సీట్లు సౌకర్యవంతమైన కుషనింగ్‌తో ఊదా రంగులో ఉంటాయి. రైలులో మొబైల్ హోల్డర్లు, స్లైడర్ ఆధారిత విండో గ్లాస్ అమర్చబడి ఉంటాయి. ఇవి ప్రయాణీకులకు మోడ్రన్ టచ్ ఇస్తాయి. స్టేషన్‌ను సమీపించే వివరాలను ప్రదర్శించడానికి రైలులో ప్రయాణీకుల సమాచార వ్యవస్థ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గంటకు 130 కిలోమీటర్లు గరిష్ట వేగంతో ఈ ట్రైన్ నడవనుంది.
ఈ రైల్లో మొత్తం 22 LHB బోగీల్లో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్, సమాచార వ్యవస్థ, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా.. సౌకర్యవంతంగా సీట్లు, LED లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు
ఈ ట్రైన్‌లో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించొచ్చు. 800 కి.మీ.కుపైగా దూరంగా ఉన్న నగరాల్ని కలుపుతూ సేవలుంటాయి.
Amrit Bharat Express is a scaled-down/non-AC version of Vande Bharat Express #amritbharatExpress #vandebharat pic.twitter.com/s7u6wfXkZA
— TechChaitu (@techchaituu) December 26, 2023
Read Also : Tyre Care Tips: మీ కారు టైర్లను జాగ్రత్తగా చూసుకోండిలా..!