Air India Plane Crash : రోజు రోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Air India Plane Crash : నిన్నటి వరకు నమోదు అయిన మృతుల సంఖ్య 274 కాగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో మరో ఐదుగురు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు
- By Sudheer Published Date - 11:33 AM, Sun - 15 June 25

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ( Air India Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లండన్‌కు బయలుదేరిన AI-171 విమానం ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే సర్దార్ వల్లభభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది, వైద్యులు, ఇలా అనేక రంగాలవారు ఉన్నారు.
Char Dham Yatra : చార్ ధామ్ యాత్రలో హెలికాప్టర్లపై నిషేధం
నిన్నటి వరకు నమోదు అయిన మృతుల సంఖ్య 274 కాగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిలో మరో ఐదుగురు ఈరోజు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దుర్ఘటన అనంతరం మృతదేహాల పరిస్థితి దృష్ట్యా గుర్తింపు ప్రక్రియలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు DNA పరీక్షల ఆధారంగా కేవలం 19 మృతులను మాత్రమే గుర్తించగలిగారు. మిగిలిన మృతుల గుర్తింపునకు మరిన్ని నమూనాలు అవసరమవుతుండటంతో, అధికారులు కుటుంబ సభ్యులకు సహాయంగా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విషాద ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిష్పాక్షిక విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
Gaddar Awards : రేవంత్ అన్నగారికి థాంక్యూ అని అల్లు అర్జున్ బ్రతికిపోయాడు
మరోపక్క విమాన ప్రమాద ఘటనలో తమ సంస్థ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను తుర్కియే ఖండించింది. కూలిన విమానానికి టర్కిష్ టెక్నిక్ సంస్థ నిర్వహణ (మెయింటెనెన్స్) చేపట్టిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తుర్కియేకు చెందిన కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని డిస్ఇన్ఫర్మేషన్ నిరోధక కేంద్రం ఎక్స్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.