HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Air India Flights To Resume From August 1

Air India Flights : ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పున:ప్రారంభం – ఎయిర్ ఇండియా

Air India Flights : బెంగళూరు-లండన్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-న్యూయార్క్ వంటి పలు ప్రధాన రూట్లలో సర్వీసులు తాత్కాలికంగా తగ్గించబడ్డాయి

  • Author : Sudheer Date : 16-07-2025 - 1:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Air India Flights To Resume
Air India Flights To Resume

జూన్ 12న జరిగిన బోయింగ్ AI 171 విమాన ప్రమాదం అనంతరం విధించిన ‘భద్రతా విరామం’ తరువాత, ఎయిర్ ఇండియా (Air India Flights) ఆగస్టు 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనుంది. తాజాగా ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదటిగా కొన్ని మార్గాల్లో విమానాలు తిరిగి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి అన్ని అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నట్టు స్పష్టం చేసింది. అహ్మదాబాద్ నుండి లండన్ (హీత్రూ) వరకు వారానికి మూడు సార్లు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఢిల్లీ-లండన్, ఢిల్లీ-జూరిచ్, ఢిల్లీ-టోక్యో, ఢిల్లీ-సియోల్ వంటి కీలక అంతర్జాతీయ మార్గాల్లో తగ్గించిన సర్వీసులను పునరుద్ధరించారు. ఈ మార్గాల్లో విమానాల సంఖ్యను మళ్లీ పెంచుతూ ప్రయాణికులకు మౌలిక సౌకర్యాలను అందించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమైంది.

Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు

బెంగళూరు-లండన్, ఢిల్లీ-పారిస్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-టొరంటో, ముంబై-న్యూయార్క్ వంటి పలు ప్రధాన రూట్లలో సర్వీసులు తాత్కాలికంగా తగ్గించబడ్డాయి. అలాగే అమృత్‌సర్-లండన్ (గ్యాట్విక్), గోవా-లండన్ (గ్యాట్విక్), బెంగళూరు-సింగపూర్, పూణే-సింగపూర్ వంటి మార్గాల్లో సెప్టెంబర్ 30 వరకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య విమానాలు రద్దైన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయ బుకింగ్ లేదా పూర్తి డబ్బు తిరిగి పొందే అవకాశం కల్పిస్తోంది. సేవలలో మార్పులపై ఎయిర్ ఇండియా క్షమాపణలు తెలుపుతూ, భద్రతే తమకు ముఖ్యమని పేర్కొంది. ఈ పాక్షిక పునరుద్ధరణతో ప్రస్తుతం ఎయిర్ ఇండియా వారానికి 525 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు నడుపుతుండడం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI171 crash
  • Air India Flights
  • Air India to partially resume
  • international flights from August 1

Related News

    Latest News

    • ట్రైన్ టికెట్ చార్జీల పెంపుపై ప్రయాణికులు ఆగ్రహం, ఏం సౌకర్యాలు కల్పించారని ఛార్జీల పెంపు?

    • నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? హార్వర్డ్ అధ్యయనం చెప్పే నగ్న సత్యాలు

    • వాట్సాప్ లో కొత్త మోసం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి !

    • టీమిండియాకు బిగ్ షాక్‌.. డ‌బ్ల్యూటీసీలో ఆరో స్థానానికి ప‌డిపోయిన భార‌త్‌!

    • జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ

    Trending News

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd