Congress prez poll: ఓటర్ల జాబితా బహిర్గతానికి ఏఐసీసీ తిరస్కరణ
సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్ల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు చేస్తోన్న డిమాండ్ ను ఏఐసీసీ తిరస్కరించింది.
- By Hashtag U Published Date - 02:40 PM, Thu - 1 September 22

సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటర్ల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు చేస్తోన్న డిమాండ్ ను ఏఐసీసీ తిరస్కరించింది. పార్టీలోని ఏ సభ్యుడైనా పీసీసీ కార్యాలయాల్లో ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకోవచ్చని ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. అంతర్గత ప్రక్రియను ప్రజలు అందరూ చూడడానికి ప్రచురించడానికి వీల్లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మపన్ మధుసూదన్ మిస్త్రీ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఓటర్ల జాబితా ప్రక్రియ “ఇన్ -హౌస్ విధానంష ఏ సభ్యుడు అయినా దాని కాపీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాలలో పొందడానికి అవకాశం ఉంది. వచ్చే వారం రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర కోసం జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించేందుకు కేరళ వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడారు. పార్టీ సభ్యుడు అయినా ఓటర్ల జాబితా కాపీని ఎక్కడైనా తనిఖీ చేసుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్‌లో అలాంటి పద్దతి లేదని, పాత పద్ధతినే కొనసాగిస్తామని వేణుగోపాల్ అన్నారు. కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు న్యాయబద్ధతను కోరుతూ కొందరు చేస్తోన్న డిమాండ్ల క్రమంలో పాత పద్ధతి కొనసాగుతుందని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండేలా ఓటర్ల జాబితాలను బహిరంగపరచాలని పార్టీ నేతలు మనీష్ తివారీ, శశి థరూర్ , కార్తీ చిదంబరం డిమాండ్ చేసిన విషయం విదితమే.