Explosion : బాణసంచా వ్యాపారి ఇంట్లో పేలుడు…6గురు మృతి..!
బీహార్ లో ఘోరం జరిగింది. ఓ బాణసంచా వ్యాపారి నివాసంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
- By hashtagu Published Date - 01:26 AM, Mon - 25 July 22
బీహార్ లో ఘోరం జరిగింది. ఓ బాణసంచా వ్యాపారి నివాసంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు గంటసేపు పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇక పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో మరో 8మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వ్యాపారి ఇంటికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Tags
Related News
Patna News: పాట్నాలో ఘోర ప్రమాదం.. క్రేన్‌ను ఆటో ఢీకొనడంతో ఏడుగురు మృతి
బీహార్ రాజధాని పాట్నాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కంకర్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో పనిలో నిమగ్నమై ఉన్న క్రేన్, ఆటో రిక్షా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన స్థానికంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. వివరాలలోకి వెళితే..