100 Lord Ram Idols : శ్రీరాముడి 100 విగ్రహాలతో అయోధ్యలో శోభాయాత్ర.. ఎప్పుడు ?
100 Lord Ram Idols : జనవరి 22న నవ్య భవ్య అయోధ్య రామమందిరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది.
- By Pasha Published Date - 09:27 AM, Mon - 11 December 23

100 Lord Ram Idols : జనవరి 22న నవ్య భవ్య అయోధ్య రామమందిరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరగబోతోంది. ఈ మహా ఘట్టానికి వారం రోజుల ముందు (జనవరి 17న) అయోధ్యలో భారీ శోభాయాత్రను నిర్వహించనున్నారు. శ్రీరాముడి జీవితంలోని వివిధ దశలను కళ్లకు కట్టేలా.. శ్రీరాముడి 100 విగ్రహాలను ప్రదర్శిస్తూ ఈ శోభాయాత్ర జరుగుతుంది. వారం రోజులపాటు జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనా మహోత్సవాలకు ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీరాముని జననం, వనవాసం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలను ప్రతిబింబించేలా శ్రీరాముడి విగ్రహాలు(100 Lord Ram Idols) ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు. ఇప్పటికే 60 విగ్రహాల తయారీ పూర్తయిందని వెల్లడించారు. ఈ విగ్రహాలను తయారు చేసే అవకాశం తనకు లభించడాన్ని గొప్ప అదృష్టంగా ఆయన అభివర్ణించారు.
We’re now on WhatsApp. Click to Join.
నూతనంగా నిర్మించిన అయోధ్య రామమందిర గర్భగుడిలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్ లల్లా కొలువుతీరుతారు. ఈ వేడుకకు ప్రధాని మోడీతో పాటు వందలాది మంది ప్రముఖులు హాజరవుతారు. ఇక అయోధ్య రామమందిరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందని శ్రీరామ జన్మభూమి మందిర్ ట్రస్ట్ కార్యదర్శి మహంత్ గోవింద్ గిరిదేవ్ వెల్లడించారు.